Y.S.Jagan: వైఎస్ఆర్సిపి అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఎలా ఉంటాయనే విషయాల గురించి జగన్ దగ్గర పనిచేసిన మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.జగన్ ర్యాపిడ్ యాక్షన్ వల్లే.. ఆయన చాలా నష్టపోయారనీ, 2029 ఎన్నికలలో ఓటమికి కూడా అదే కారణం అంటూ సుబ్రహ్మణ్యం తెలిపారు.
గత ప్రభుత్వ హయామంలో ఎన్నో రకాల వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి వివాదాలలో ఉచిత ఇసుక అలాగే మద్యం ఈ రెండు వివాదాలు ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చాయి.జగన్ అధికారంలోకి వస్తూనే ఉచితాన్ని రద్దు చేశారు. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఫలితంగా చాలా మంది ఆకలి చావులు ఎదుర్కొన్నారు. మద్యం విషయంలో కూడా ఎన్నో రకాల మార్పులను చేశారు.
ఇలా ఈ రెండు అంశాలు సంచలనంగా మారినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ విధానాలు వద్దని మేము చెప్పినప్పటికీ అన్న దాని గురించి నిర్ణయం అయిపోయింది. ఇక ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అంటూ మమ్మల్ని అనేవారు.సీఎం పోస్టును కేవలం ప్రభుత్వ ఉద్యోగంగా ఆయన చూసినట్టు తెలిపారు. ఉదయం 11 గంటలకు వచ్చి.. సాయంత్రం 6 అయ్యే సరికి పైకి వెళ్లిపోయేవారని ఎల్వీ చెప్పుకొచ్చారు.
జగన్ కేవలం అధికారులతో మాత్రమే కాదు ఇతర నాయకులతో కూడా ఇలాగే వ్యవహరించేవారు అంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. జగన్ తీరు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన సీతయ్య ఒక్కసారి చెబితే ఇక దానిపై నిర్ణయం మారదని తెలిపారు. జగన్ తీసుకొనే నిర్ణయాలు ఆయనకి మంచివిగా అనిపించిన జనాలలోకి అవి చాలా నెగిటివ్ గా వెళ్లేవని సుబ్రహ్మణ్యం తెలిపారు. డబ్బులు ఇస్తే.. ఏదో తనకు మేలు జరుగుతుందని జగన్ అనుకున్నారని.. కానీ, దూరదృష్టి లేని రాజకీయం, స్థితిమతం లేదని పాలన కారణంగా ఇబ్బందులు పడ్డారని జగన్ రాజకీయ జీవితం గురించి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.