టాలీవుడ్ స్టార్ హీరోలలో ఏ హీరో ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా?

సినిమా సక్సెస్ సాధించినా ఫ్లాప్ అయినా టాలీవుడ్ హీరోలు తమ రెమ్యునరేషన్లను పెంచడానికే తప్ప తగ్గించడానికి అస్సలు ఇష్టపడరనే సంగతి తెలిసిందే. రెమ్యునరేషన్లను తగ్గిస్తే భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా ఎఫెక్ట్ పడుతుందని భావించే హీరోల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్లను పరిశీలిస్తే ప్రస్తుతం స్టార్ హీరో ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఈ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసే మరో స్టార్ హీరో ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో లేరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆయన రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల మధ్యలో ఉందనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో ఆయనకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతోందని సమాచారం అందుతోంది. సీనియర్ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు 10 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

హీరోలు రెమ్యునరేషన్లను తగ్గించుకుంటే నిర్మాతలకు మేలు జరగనుంది. హీరోలు రెమ్యునరేషన్లను పెంచడం వల్ల సినిమాలు హిట్టైనా నిర్మాతలకు లాభం దక్కడం లేదు. పెద్ద సినిమాల నిర్మాతలు పరిమిత బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తే బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. స్టార్ హీరోలు, నిర్మాతలు రెమ్యునరేషన్ల విషయంలో జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు.