పదేళ్ల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఎంతో మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లో ఉన్నవాళ్లు ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. అయితే పదేళ్ల క్రితం ఈ స్టార్ హీరోల రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువ మొత్తం కావడం గమనార్హం. ప్రస్తుతం బన్నీ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలు అని ఇండస్ట్రీలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

అయితే పదేళ్ల క్రితం బన్నీ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయలుగా ఉండేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కేవలం 8 నుంచి 9 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 35 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.

అయితే ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ పదేళ్ల క్రితం కేవలం 8 నుంచి 9 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు 45 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా తర్వాత సినిమాలకు 60 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు 45 కోట్ల రూపాయలు రామ్ చరణ్ కు పారితోషికంగా దక్కింది.