అభిమానుల పరువు తీసిన టాలీవుడ్ స్టార్ హీరోల డిజాస్టర్ సినిమాలివే?

ప్రతి స్టార్ హీరో కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో చేసిన పొరపాట్లు, ఇతర కారణాల వల్ల ఫ్లాప్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం అభిమానులు తల దించుకునే విధంగా ఉంటాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో సుబ్బు, నాగ, ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు, శక్తి, రామయ్యా వస్తావయ్యా, రభస లాంటి డిజాస్టర్లు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో వంశీ, నిజం, సైనికుడు, 1 నేనొక్కడినే, ఆగడు లాంటి డిజాస్టర్లు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో జానీ, బాలు, కొమరం పులి, తీన్ మార్, అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్లు ఉన్నాయి. ప్రభాస్ నటించిన సినిమాలలో రాఘవేంద్ర, యోగి, మున్నా, ఏక్ నిరంజన్, రెబల్, సాహో, రాధేశ్యామ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే ఆరెంజ్, తుఫాన్, బ్రూస్ లీ, వినయ విధేయ రామ, ఆచార్య సినిమాలు ఫ్లాప్ సినిమాలుగా ఉన్నాయి. ఈ సినిమాలు రామ్ చరణ్ అభిమానులకు సైతం అస్సలు నచ్చలేదు. బన్నీ నటించిన సినిమాలలో హ్యాపీ, వరుడు, ఇద్దరమ్మాయిలతో, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి. గత 20 సంవత్సరాలలో బాలయ్య, నాగ్ నటించిన సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

వెంకటేష్ గత కొన్నేళ్లలో నటించిన సినిమాలలో హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నా ఈ సినిమాలలో ఎక్కువ సినిమాలు రీమేక్ సినిమాలు కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవికి గత కొన్నేళ్లలో ఆచార్య, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు డిజాస్టర్లుగా ఉన్నాయి. మిడిల్ రేంజ్ హీరోలలో చాలామంది ఖాతాలలో డిజాస్టర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.