బిగ్ బాస్ 6 లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ లవర్ బాయ్.. అప్పుడు మిస్ అయిన ఇప్పుడు పక్కా?

బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ఒకవైపు కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ జరుగుతూనే మరోవైపు బిగ్ బాస్ హౌస్ ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ కోసం ఉపయోగించిన హౌస్ లో కొన్ని మార్పులు చేస్తూ హౌస్ ని ఏర్పాటు చేస్తున్నారు.అలాగే ఈ కార్యక్రమం ద్వారా కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతుందని తెలియడంతో కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది.

ఈ సీజన్ లో కామన్ మ్యాన్ ఎంట్రీగా తెలంగాణకు చెందిన లాయర్ రాబోతున్నారని వార్తలు వచ్చాయి.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదివరకే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వచ్చాయి అలాగే ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ ఈ కార్యక్రమంలో సందడి చేయబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. తాజాగా మరొక హీరో పేరు తెరపైకి వచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో తరుణ్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ముఖ్యంగా ఈయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో ఈయనకు లవర్ బాయ్ అనే పేరు వచ్చింది.ఇక గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి తరుణ్ తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఈయన సీజన్ 2 కార్యక్రమంలోకి రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారని అయితే అప్పుడు మిస్ అయిన ఈసారి మాత్రం పక్కా ఎంట్రీ ఉంటుందని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.