‎Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్.. వీడియో వైరల్!

‎Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా జూలై 31వ తేదీన విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు.

‎ఇందులో భాగంగానే తాజాగా అన్నదమ్ముల ఎమోషనల్ సాంగ్‌ ను విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాలో విజయ్‌, సత్యదేవ్‌ అన్నదమ్ములుగా నటించారు. ఈ ఇద్దరి అనుబంధం నేపథ్యంతో రూపొందిన అన్నా అంటూనే అనే సాంగ్‌ ను రిలీజ్ చేశారు. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను అనిరుధ్‌ ఆలపించారు. అయితే ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Anna Antene Lyrical Video | Kingdom | Vijay Deverakonda, Satya Dev | Anirudh Ravichander | Gowtam

‎సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ లో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. తాజాగా విడుదల అయినా ఎమోషనల్ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా ఈ సినిమాతో ఎలా అయినా సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. మరి హీరో విజయ్ కి ఈ సినిమా ఏ మేరకు గుర్తింపును తెచ్చిపెడుతుందో చూడాలి మరి.