Home News గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేయనున్న స్టార్ హీరో?

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేయనున్న స్టార్ హీరో?

ప్రస్తుతం తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలే హాట్ టాపిక్. చలికాలంలోనూ రాజకీయాలు తెగ వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగాయి. ఎవరిని దించితే ఓటర్లు ఆకర్షితులవుతారో.. వాళ్లనే పార్టీలు దింపుతున్నాయి. ప్రచారం చేయిస్తున్నాయి.

Tollywood Hero To Campaign In Ghmc Elections For Tdp
tollywood hero to campaign in ghmc elections for tdp

అయితే.. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీకి తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన టీడీపీ నాయకులు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా.. అది సరిపోవడం లేదు. జనాలు ఎవ్వరూ టీడీపీ మాట వినడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నారు తెలంగాణ టీడీపీ నేతలు.

అన్ని సీట్లలో కాకున్నా.. దాదాపు సగానికి పైగా సీట్లలో ఈసారి టీడీపీ పోటీ చేసింది. దానికి తగ్గ ప్రచారం చేస్తేనే కొన్ని సీట్లు అయినా గెలిచే అవకాశం ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ లో ప్రచారం చేయరు. ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరు. లోకేశ్ కూడా రావట్లేదు అని అంటున్నారు. బాలకృష్ణ కూడా ప్రచారం చేయరని తెలుస్తోంది.

Tollywood Hero To Campaign In Ghmc Elections For Tdp
Nandamuri kalyan ram to campaign in ghmc elections

వీళ్లెవరూ రాకుంటే ఎన్నికల ప్రచారం ఎలా? అని అనుకుంటన్నవేళ… ఈసారి స్టార్ హీరోను ఎన్నికల ప్రచారం కోసం దింపాలని టీడీపీ యోచిస్తోందట. దానికోసం తెలుగు హీరో కళ్యాణ్ రామ్ ను బరిలో దించనున్నారట. బాలకృష్ణ కోరిక మేరకు కళ్యాణ్ రామ్ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే.. కళ్యాణ్ రామ్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం అయితే రాలేదు.

- Advertisement -

Related Posts

విజయవాడ దుర్గ గుడికి వెళ్ళే ప్రతీ ఒక్కరికీ సూపర్ గుడ్ న్యూస్

నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో నిన్న జరిగిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాలు (టీటీడీ), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ (గోపూజ) నిర్వహిస్తున్నారు....

ఆ విషయంలో ఎన్నడూలేనంత కంగారు పడుతున్న వైఎస్ జగన్?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయటం, జరపలేమంటూ అధికార ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళటం, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు...

అమ్మో హనుమ విహారి మామూలోడు కాదు , బిగ్ బాస్ 4 ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టాడు.

బిగ్ బాస్ అభిజీత్ కి ఇప్పుడు ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా 2012లో విడుదలైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో టాలీవుడ్...

రవితేజ ఫ్యాన్స్ మీసం మెలేస్తున్నారుగా ..!

రవితేజ చాలాకాలం తరువాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 'క్రాక్' సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన రవితేజ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. వరసగా ఫ్లాప్స్ చూసిన రవితేజ ఈ సంక్రాంతి సీజన్ లో...

Latest News