Tollywood Directors: ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం దక్షిణాది రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితం అయ్యేవి. తెలుగులో తెరకెక్కిన సినిమాలు తెలుగు తమిళ కన్నడ భాషలలో డబ్ అవుతూ.. దక్షిణాది సినీ ప్రేమికులను ఆకట్టుకునే విధంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే మొట్టమొదటిసారిగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమా స్టామినా ఎంటో ప్రపంచానికి తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ చూపు తెలుగు సినిమా ఇండస్ట్రీ పై పడింది. ఈ క్రమంలోనే సుకుమార్ పుష్ప సినిమా ద్వారా మరోసారి తెలుగు సినిమా రుచిని అందరికీ చూపించారు.
ఇలా సుకుమార్ రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తెరకెక్కించి అందరిచూపు తెలుగు సినీ ఇండస్ట్రీపై పడేలా చేశారు అలాగే ఈ ఏడాది రాజమౌళి RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అలాగే సుకుమార్ సినిమా ద్వారా మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ పై అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఇలా వీరిద్దరూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో మిగతా డైరెక్టర్లు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ పై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు.
వీరి బాటలోనే పూరి జగన్నాథ్ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలా ఒక్కసారిగా టాలీవుడ్ డైరెక్టర్ల చూపు బాలీవుడ్ పై పడనుందని తెలుస్తోంది.