ప్రకాశ్ రాజ్.. సినీ నటుడు మాత్రమే కాదు.. టైమ్ టు టైమ్ దేశంలో జరుగుతున్న రాజకీయాలపై తన స్పందనను తెలియజేస్తుంటారు. రాజకీయాల్లోనూ అప్పుడప్పుడు వేలు పెడుతుంటారు. వివాదస్పద ట్వీట్లు కూడా చేస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద.
ఆయన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పార్టీ గురించి స్పందించలేదు కానీ.. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ స్పందించారు.
పవన్ ను సూటిగా ప్రశ్నించారు. పవన్ పూటకో మాట మార్చే ఊసరవెల్లి అని.. ఆయనకు ఓ పార్టీ ఉన్నాక.. వేరే పార్టీకి ఓటెయ్యాలంటూ చెప్పడమేంటంటే ప్రశ్నించారు. ఆయన అభిమానులకు, కార్యకర్తలకు బీజేపీకి ఓటేయాలంటూ చెప్పాక.. ఇక తన పార్టీ బీజేపీ ఎందుకు అంటూ ప్రశ్నించారు.
ఆయనకు అసలు ఏమైందో నాకైతే అర్థం కావడం లేదు. పవన్ రాజకీయాలు ఇలా ఉంటాయని నేను ఏనాడూ అనుకోలేదు. నేను మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యా. నీకు పార్టీ ఉంది. నువ్వొక నాయకుడివి. కానీ.. నువ్వు వేరే పార్టీకి ఓటెయ్యాలంటూ చెప్పడం ఏంది? అసలు.. ఏపీలో జనసేన ఓటు బ్యాంకు ఎంత ఉంటుంది? 2014 లో బీజేపీకి ఓటెయ్యాలన్నావు. వాళ్లు గొప్పోళ్లు అన్నావు. 2019 ఎన్నికల్లో వాళ్లు ద్రోహులు అన్నావు. మళ్లీ ఇప్పుడు వాళ్లతో కలిసి.. నీ పార్టీని పక్కన పెట్టి.. వాళ్లకే ఓటెయ్యాలంటున్నావు.. ఇలా మారేవాళ్లను ఊసరవెల్లి అంటారు.. అంటూ ప్రకాశ్ రాజ్ అన్నారు.
అలాగే.. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని… టీఆర్ఎస్ కే ఓటేయాలంటూ ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. జాతీయ పార్టీలన్నీ ఫెయిల్ అయ్యాయని… కేంద్ర మంత్రులంతా హైదరాబాద్ లో వాలిపోతున్నారని.. వాళ్లను తరిమికొట్టాలని.. వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటూ ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు.