Vaikunta ekadashi: నేడు వైకుంఠ ఏకాదశి.. ఈ రోజు ఈ వ్రతం ఆచరిస్తే.. పుత్ర సంతానం కలుగుతుంది!

Vaikunta ekadashi: సాధారణంగా ప్రతి మాసంలో ఏకాదశి రావడం మనకు తెలిసిందే అయితే కొన్ని ఏకాదశులు ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు. అలాంటి ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి ఒకటి. వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో శుక్ల పక్షంలో ఈ ఏకాదశిని జరుపుకుంటారు. ఇలా జరుపుకునే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి, లేదా పుత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఈ ఏకాదశి రోజున ఆ నారాయణుడిని పరమభక్తితో పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భక్తులు భావిస్తారు.

ఈ క్రమంలోనే వైకుంఠ ఏకాదశి రోజు ఉదయమే భక్తులు పెద్ద ఎత్తున శ్రీహరి ఆలయాలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఆలయాలలో ఉత్తర ద్వారం తెరచి ఉంటారు. ఈ ద్వారం కింద వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటే మరణం తర్వాత వైకుంఠం ప్రాప్తిస్తుందని భావిస్తారు. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఉదయమే స్నానమాచరించి ఇంట్లో స్వామివారిని పూజించుకున్న అనంతరం ఆలయానికి వెళ్తారు.

ఇక ఈ ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు.ఎవరైతే పుత్రసంతానం కోసం ఎదురుచూస్తున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల వారికి పుత్ర సంతాన యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి వైకుంఠ ఏకాదశి తిధి ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది అనే విషయానికి 12వ తేదీ సాయంత్రం 04:49 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటిరోజు అంటే 2022 జనవరి 13న 07:32 PM వరకు ఉంటుంది. అయితే ఉపవాసంతో ఉండి పూజ చేసేవారు నేటి సాయంత్రం నుంచి ఉపవాస దీక్షలు చేస్తూ స్వామి వారిని పూజించడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి . ఇకపోతే పుత్ర ఏకాదశి వ్రతం ఆచరించడానికి 13వ తేదీ మధ్యాహ్నం వరకు ఎంతో అనువైన సమయం.