జూ.ఎన్టీఆర్ వస్తే టీడీపీ బ్లాక్ బస్టర్ అయిపోతుందనుకున్న వాళ్లు ఈ పాయింట్ తెలుసుకోవాలి 

TDP seniors should put pressure on Chandrababu Naidu
ఒకప్పుడు వైభవోపేతంగా వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.  గతంలో ఎన్నాడూ లేని సంక్షోభంలో పార్టీ కూరుకుపోయింది.  అధికారం లేకపోయినా మంచి సంఖ్యా బలంతో ప్రతిపక్షంగా ఘనంగా కనబడిన పార్టీ ఇప్పుడు బక్కచిక్కి పోయింది.  ఈ దారుణ పరిస్థితి నుండి పార్టీని గట్టెంక్కించడం సాధ్యమా అంటే అనుమానమే అంటున్నారు విశ్లేషకులు.  కారణం నాయకత్వ లోపం.  చంద్రబాబుకు వయసు మీదపడటం, లోకేష్ మీద అంత గురి లేకపోవడంతో పార్టీలో నాయకత్వ లోపం బలంగా కనిపిస్తోంది.  చివరికి లోకేష్ చేతికి రాష్ట్ర అధ్యక్ష బాద్యతలు అప్పగించాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి.  సరైన యువనాయకత్వం లేకపోవడమే ఈ సంక్షోభానికి కారణం. 
Chandrababu Naidu
 
మరి దీనికి పరిష్కారం ఏమిటయా అంటే జూ.ఎన్టీఆర్ పార్టీలోకి రావడమేననేది తెలుగు తమ్ముళ్ళ సమాధానం.  తారక్ పార్టీలోకి వచ్చి పార్టీ పగ్గాలు అందుకుంటే పరిస్థితి ఇట్టే మారిపోతుందని, పార్టీ పుంజుకుని అధికారంలోకి వచ్చేస్తుందని అభిమానులు అంటున్నారు.  కానీ ఆ అంచనాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంది.  ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు సినిమాలు వదిలేసి పార్టీలోకి వచ్చేసినా, బాబుగారు అంతా ఆయనకే అప్పగించినా ఒరిగేదేమీ లేదంటున్నారు కొందరు.  ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే పార్టీ అభిమానులు సంతోషపడవచ్చు కానీ సామాన్య జనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు.  ఎందుకంటే అధికారంలో ఉన్న వైఎస్ జగన్ బలం మాములుగా లేదు.  ఆయనేమీ బొటాబొటీగా అధికారంలోకి రాలేదు.  బంపర్ మెజారిటీతో కుర్చీ ఎక్కారు.  ఆయన్ను కదపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.  అవతల ఎంతో బలమైన లీడర్ ఉండి మెరాకిల్స్ చేయాలి.  
 
కానీ ఎన్టీఆర్ కు ఆ చరీష్మా, అంతటి రాజకీయ చతురత ఉన్నాయా అంటే అవునని చెప్పలేం.  ఇక సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చే వారిని ప్రజలు ఇంతకుముందులా నెత్తిన పెటుకోవడం లేదు. ముందు స్టబిలిటీని ప్రూవ్ చేసుకోండి అంటూ పక్కనపెట్టేస్తున్నారు.  ఇప్పుడే ఇలా ఉందంటే రాబోయే రోజుల్లో సినిమా వాళ్లకు రాజకీయ రంగం మరింత కఠినంగా మారిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.  స్వయానా తారక్ స్నేహితుడు, టీడీపీకి వారసుడు తారక్ అని ఎప్పుడూ అనే కొడాలి నాని సైతం ఎన్టీఆర్ దిగినా పార్టీని బ్రతికించుకోవడం కష్టం అన్నారంటే సిట్యుయేషన్ ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  సో.. ఉన్నపళంగా జూ. ఎన్టీఆర్ దిగొచ్చినా పాతాళంలో ఉన్న పార్టీని పైకి లేపడం అసాధ్యం.