తిరుపతి బై పోల్ : ఆ రెండు పార్టీల పరిస్థితి అగమ్యగోచరం

మున్సిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపించింద‌నే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫ‌లితాలు ఎలా ఉన్న కీల‌క నేత‌లైన చంద్ర‌బాబు, సోమువీర్రాజు నియోక‌వ‌ర్గాల్లో కూడా వాళ్ల ప‌ట్టు క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు టీడీపీ, బిజేపీల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈ ఫ‌లితాల షాక్ నుంచి తేరుకోక ముందే తిరుప‌తి పార్ల‌మెంట్ ఉపఎన్నిక‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల కావడంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో టెన్ష‌న్ వాత‌వ‌ర‌ణం నెల‌కొంది.

ఇప్ప‌టికే టీడీపీ ప‌న‌బాక ల‌క్ష్మీని తిరుప‌తి నుంచి బ‌రిలో దింపే అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు. అయితే ప‌న‌బాక ల‌క్ష్మీ మాత్రం తాను తిరుప‌తి నుంచి పోటీ చేయ‌బోతున్న అభ్య‌ర్ధిని అనే విష‌యం మార్చిపోయారని సొంతపార్టీ నేతలే అంటున్నారు. తొలి నుంచి ఇక్క‌డ నంచి పోటీ చేయ‌డానికి స‌ముఖంగా లేని ప‌న‌బాక ల‌క్ష్మీ తాజాగా మున్సిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో బ‌రిలో ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ ఆమె బ‌రి నుంచి త‌ప్పుకుంటే ఇప్పుడున్న ప‌రిస్థితిల్లో ఇప్ప‌టికిప్పుడు టీడీపీ నుంచి తిరుప‌తి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్ధ‌ని ఎంపిక చేయ‌డం త‌ల‌కుముంచిన భారం అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పార్టికి ఉన్న వేవ్ చూస్తే ఇక్క‌డ నుంచి బ‌రిలో నిల్చొడానికి ఎవ‌రు ముందుకొచ్చే ప‌రిస్థితులు ఉండ‌క‌పోవ‌చ్చనే చర్చ జరుగుతోంది.

ఇక బీజేపీ పరిస్థితి కూడా ఇదే. బ‌రిలో నిల‌వ‌డానికి ఎవ్వ‌రు ముందుకొచ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌ని వాపోతున్నారు పార్టీలో ప‌లువురు నేత‌లు. సీనియ‌ర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాస‌రి శ్రీనివాసులు బ‌రిలో నిలుస్తారనేది కూడా ఇప్పుడు సందేహాంగా ఉంది. మొన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపి నుంచి పోటీ చేసిన అభ్య‌ర్ధ‌ల‌కు వ‌చ్చిన ఓట్లు చూస్తే ఇక్క‌డ ఆ పార్టీ ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇదిలా ఉంటే పుండుమీద కారం చ‌ల్లిన‌ట్లు జ‌న‌సేన స్థానిక శ్రేణులు మంగ‌ళ‌వారం స‌మావేశం ఏర్పాటు చేసుకోని ఈ ఎన్నిక‌లో నోటా కైన ఓటు వేధ్దాం కాని బిజేపీ మాత్రం వేయ్య‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.