Tirupathi Laddu: తిరుపతి లడ్డు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయామంలో తిరుపతి లడ్డు తయారీలో జంతువుల అవశేషాలతో తయారు చేస్తున్న నూనె ఉపయోగించి లడ్డూలు తయారు చేశారు అంటూ కూటమి నేతలు ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారడమే కాకుండా ఎంతో మంది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసాయి అయితే ఇలాంటి ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను బయట పెట్టకపోవడంతో ప్రత్యేక విచారణ పేరుతో సిట్ విధించారు.
ఇక ఈ వ్యవహారంలో సిట్ అధికారులు పెద్ద ఎత్తున విచారణ జరుపుతున్నారు అయితే ఈ విచారణలో భాగంగా నలుగురను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది .ఇలా ఈ వ్యవహారంలో నలుగురు అరెస్టు కావడంతో వైకాపా నేతలలో వణుకు మొదలైందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి కొంతమంది కీలక నేతలతో జగన్ రహస్య మంతనాలు జరిపినట్టు సమాచారం.
మూడు డెయిరీలకు చెందిన నలుగుర్ని సీబీఐ ఆధ్వర్యంలోని స్పెషల్ టీమ్ అరెస్ట్ చేసింది. అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ రిపోర్టులో ఏ-1ను ఖాళీగా ఉంది. రాజశేఖరన్‌ను ఏ-2, పోమిల్ జైన్‌ను ఏ-3, బిపిన్ జైన్‌ను ఏ-4 అపూర్వ చావ్దాను ఏ-5గా పేర్కొంది. ఏ-1 ఎవరనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక ఈ వ్యవహారంలో ఏ-1 గా తిరుమలలో కీలక బాధ్యతలు వహించిన గత ప్రభుత్వ నేతలు ఉంటారనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే కొంతమంది కీలక నేతలు గత రాత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయంపై సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారని వీరి మాటలు అన్నింటిని జగన్ చాలా క్షుణ్ణంగా విన్నారట. సిట్ ఇప్పటికే టీటీడీకి చెందిన కొందరు ఉద్యోగులను విచారించింది. వారిలో ఆనాటి పెద్దల పేర్లు చెప్పినట్టు వార్తలు లేకపోలేదు. దీంతో అప్పటి అధికారులు, ప్రభుత్వ పెద్దలతో చిన్నపాటి టెన్షన్ మొదలైంది. తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చని కొంతమంది నేతలు తలలు పట్టుకున్నారట. ఈ వ్యవహారంలో వైకాపా నాయకుల ప్రమేయం ఉందని తెలిస్తే కనుక ఇది వైసిపికి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.