‎Kingdom: వారం రోజుల ముందే కింగ్ డమ్ మూవీకు టికెట్ రేట్ల పెంపు.. టికెట్ రేట్ ఎంతో తెలుసా?

Kingdom: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఒక ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది.

‎తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు మరొక ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇది ఇలా ఉంటే ఇటీవల పెద్ద సినిమాలకు ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు, స్పెషల్ షోలకు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో మాత్రం చారిత్రాత్మిక సినిమాలకు తప్ప ఏ సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సినిమా రిలీజ్ కి ఒక రోజు లేదా రెండు రోజుల ముందు టికెట్ రేట్ల పెంపు ప్రకటిస్తారు.

‎ కానీ కింగ్డమ్ సినిమా రిలీజ్ కి ఇంకా వారం రోజులు ఉండగానే టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించగా సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టిప్లెక్స్ లలో 75 రూపాయలు రిలీజ్ రోజు నుంచి పది రోజుల పాటు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. దీంతో కింగ్డమ్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెరగనున్నాయి. స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు మాత్రం ఏమి లేనట్టు తెలుస్తుంది. ఇక కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జులై 26న తిరుపతిలో నిర్వహించనున్నారు. జులై 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.