Accident: దేశంలో ప్రతి రోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేసినా కూడా వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలను తీవ్ర శోకం మిగులుస్తున్నారు . తాజాగా హన్మకొండ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే… శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళా కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చీ తోటలో పనికి వెళ్లేందుకు ట్రాలీ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీఅత్యంత వేగంగా వచ్చి కూలీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని సైడ్ నుండి తగిలింది. ఈ క్రమంలో సైడ్ లో ఉన్న కూలీలను గుద్దుకుంటు వెళ్ళటంతో ముగ్గురు మహిళలు మరణించారు.
ఈ ప్రమాదంలో మరొక ఏముంది కూడా తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురిని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పొట్టకూటి కోసం అని పనికి వెళుతున్నా కూలీల ఇలా మరణించటంతో వారి కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారింది.