ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, ఎలాగైనా సరే వైసీపీ పార్టీలో చేరిపోవాలని తెగ ఆరాటపడి పోతున్నాడు. 2019 ఎన్నికల తర్వాత నుండి ఇప్పటిదాకా అదే పనిలో వున్నాడు. మధ్యలో నాలుగైదు సార్లు వాయిదా పడిన కానీ, నిరాశ చెందకుండా తన ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు, ఇంతగా కష్టపడుతున్న కానీ గంటాను వైసీపీలోకి రాకుండా అడ్డకుంటుంది ఎవరయ్యా అంటే ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి, అందులో ఒకరు విజయ సాయి రెడ్డి, మరొకరు అవంతి శ్రీనివాస్.
గతంలో విశాఖ లో గంటా శ్రీనివాసరావు అనేక భూదందాలు చేశాడంటూ విజయసాయి రెడ్డి పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేసాడు. అలాంటిది ఇప్పుడు అతన్ని తమ పార్టీలోకి చేర్చుకుంటే పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్లినట్లు అవుతుంది. దానికి తోడు గంటా వైసీపీ లోకి వస్తే విశాఖలో విజయసాయి రెడ్డి ప్రభావం తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. మరోపక్క అవంతి శ్రీనివాస్ కి అసలు రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తి గంటా శ్రీనివాస రావు. అయితే ఈ మధ్య కాలంలో గంటా కు, అవంతి కి రాజకీయ వైరం పెరగటంతోనే టీడీపీని విడిచిపెట్టి అవంతి వైసీపీ లోకి వచ్చాడు. ఎట్టి పరిస్థితి లోను గంటాను వైసీపీలో చేరుకోకూడదంటూ ఒప్పందం చేసుకున్న తర్వాతే అవంతి వైసీపీలో చేరాడనే మాటలు వినిపిస్తున్నాయి.
నేడు అందుకు భిన్నంగా గంటాను చేర్చుకోవటానికి జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో అవంతి అవసరం అయితే రాజీనామా చేస్తాననే బెదిరింపు ధోరణికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక వీళ్ళ తర్వాత పార్టీలోకి గంటా రాకను వ్యతిరేకిస్తున్న మరో వ్యక్తి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. గంటా కనుక వైసీపీలోకి వస్తే తనకి రాజకీయంగా భవిష్యత్తు ఉండదేమో అనే భయంతో వున్నాడు. అనకాపల్లిలో గంటాకు బలమైన క్యాడర్ ఉంది. రేపొద్దున్న ఇక్కడ నుండి గంటా ఎన్నికల గోదాంలోకి దిగిన దిగవచ్చు. అందుకే అమర్నాథ్ భయపడుతూ, గంటా రాకను అడ్డుకోవటానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఇంత మంది వ్యతిరేకిస్తున్న కానీ గంటాను వైసీపీ లోకి తీసుకోని రావాలని చూస్తున్న ఆ ఇతర వ్యక్తులు ఎవరనేది మాత్రం అంతు చిక్కటం లేదు…