Crime News: సాధారణంగా దొంగలు వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతూ దొరికిన కాడికి దోచుకుంటారు. కానీ ఈ దొంగ మాత్రం ఎంతో వెరైటీ.అయితే ఈ దొంగ ఎవరిళ్లలో పడితే వారి ఇళ్లలో దొంగతనం చేయకుండా కేవలం వారి సామాజిక వర్గానికి చెందిన ఇంటిలో మాత్రమే దొంగతనాలు చేసే ప్రొఫెషనల్ దొంగా అని చెప్పవచ్చు. ఈ దొంగ వెరైటీ… అతని ప్లాన్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
రైల్వే న్యూకాలనీలో నివాసముంటున్న షేక్ షాహిద్.. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఇలా ఆటో డ్రైవర్ గా పని చేస్తూ దొంగగా కూడా మారి దొంగతనాలకు పాల్పడ్డాడు. అయితే ఇతను కేవలం వారి సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలలో మాత్రమే దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే గతనెలలో పెందుర్తిలోని మున్షీ లియాకత్ అనే ఇంట్లో వివాహం జరిగింది. తనకొడుకు వివాహ రిసెప్షన్ ఆహ్వానాన్ని అందుకున్న షాహిద్ అనుకున్న విధంగానే ఆ వివాహ రిసెప్షన్ కి హాజరుకాకుండా వరుడు ఇంటికి వెళ్లాడు.
వివాహ రిసెప్షన్ కల్యాణ మండపంలో జరగగా ఈయన బంధువుగా అతని ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న డబ్బు నగదు మొత్తం దోచుకున్నాడు. రిసెప్షన్ పూర్తి కాగానే ఇంటికి వచ్చిన యజమాని ఇంట్లో దొంగలు పడ్డారనే విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ క్రమంలోనే అన్ని కోణాలలో ఆలోచించిన పోలీసులకు క్లూ దొరకడంతో షాహిద్ కస్టడీలోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఇతని దొంగ ఐడియాలన్ని చెప్పడంతో అది విన్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలా తమ సామాజిక వర్గాలకు చెందిన వారి ఇళ్లలో దొంగతనం చేస్తే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని చెప్పడంతో పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే పోలీసులు తనని పూర్తిస్థాయిలో విచారించగా తాను ఇది వరకూ ఇలాంటి 5 దొంగతనాలకు పాల్పడ్డారని షాహిద్ ఒప్పుకున్నాడు.ఈ క్రమంలోనే అతని నుంచి 30 తులాల వెండి, మూడు లక్షల నగదు, 15 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆయనపై కేసు నమోదు చేశారు.