ఈ వారం బాక్స్-ఆఫీస్ దగ్గర దీపావ‌ళి ధ‌మాకా!

దీపావళి కూడా పెద్ద పండగ కానీ బాక్సాఫీసుకి ఎప్పుడూ క‌ల‌సి రాదు. అందుకే దీపావళికి తెలుగు లో సినిమాలు తక్కువ వస్తుంటాయి, కానీ తమిళ్ లో మాత్రం బాగానే రెలీసెస్ ఉంటాయి. ఈ సారి దీపావళికి నాలుగు సినిమాలు రిలీజ్ కి సిద్ధం గా ఉన్నాయి.

దసరా కి మిస్ అయిన మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ తో పాటు విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ అలాగే తమిళ్ సినిమాలు ‘ప్రిన్స్’, ‘సర్దార్’ తెలుగు లో దబ్ వెర్సిఒన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య శివ కార్తికేయన్ కి తెలుగు లో డిమాండ్ పెరిగింది.

దానికి తోడు.. `జాతి ర‌త్నాలు`తో న‌వ్వించిన అనుదీప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ట్రైల‌ర్ కూడా ఆక‌ట్టుకొంది. అలాగే కార్తీ కి కూడా తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తన సినిమా పై మంచు విష్ణు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చూడాలి ఈ సారి ఏ సినిమా హిట్ సాధిస్తుందో.