Prabhas New Project : ఇన్సైడ్ టాక్ : మారుతితో ప్రభాస్ సినిమాని తక్కువ అంచనా వేస్తున్నారా? అయితే ఇది మీకోసం

Prabhas New Project : టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాలో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్నవి కొన్ని ఉన్నాయి అలాగే ఇంకా స్టార్ట్ అవ్వాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అయ్యితే వీటిలో ఒక సడెన్ ప్రాజెక్ట్ గా దర్శకుడు మారుతి తో సినిమా వచ్చేసింది అని చెప్పాలి.

అసలు ప్రభాస్ లాంటి హీరో ఏంటో చిన్న చిన్న సినిమాలు తీసుకుంటే మారుతి లాంటి దర్శకుడితో సినిమా ఏంటి అని చాలా మంది అయితే నమ్మనే లేదు. కానీ ఈ కాంబినేషన్ లో అయితే సినిమా ఉందని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇదిలా ఉండగా అసలు ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది.?

ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. కానీ వాటిని ఖచ్చితంగా ఈ చిత్రం అందుకుంటుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ మంచి కలర్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసాడట.

అంతే కాకుండా చాలా కాలంగా ప్రభాస్ నుంచి మిస్ అవుతున్న రొమాంటిక్ మరియు ఎంటర్టైనింగ్ యాంగిల్ ని చూపించనున్నాడట. అంతే కాకుండా దయ్యాల బ్యాక్ డ్రాప్ లో కూడా ఈ సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా అయితే ఎక్కడా తగ్గకుండా ఉంటుందని అందుకే ప్రభాస్ కూడా నమ్మకంగా మారుతికి తనని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఇప్పుడు అయితే ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్” రిలీజ్ కి రెడీగా ఉంది.