గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మరో స్టార్ హీరో రానా దగ్గుబాటిలు హీరోలుగా సంయుక్త మీనన్, నిత్య మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. పవన్ కెరీర్ లో ఓ రేంజ్ లో హైప్ తో వచ్చిన ఈ చిత్రం ఒక్క ఏపీలో తప్ప మిగతా అన్ని చోట్ల మంచి లాభాలను అందించింది.
అయితే ఈ సినిమా మలయాళ చిత్రం అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని అప్పట్లో హిందీలో కూడా రిలీజ్ అనౌన్స్ చేశారు. పైగా హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే కొన్ని రోజులు గ్యాప్ తో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని అనౌన్స్ చేశారు.
కానీ అనుకోని విధంగా అది ఏప్రిల్ కి షిఫ్ట్ అయ్యి ఫైనల్ గా రిలీజ్ ఆగిపోయింది. అయితే ఇపుడు అసలు హిందీలో రిలీజ్ ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా ఎందుకు రిలీజ్ అవ్వలేదంటే హిందీలో ఆల్రెడీ ఈ సినిమా రీమేక్ హక్కులని ఓ స్టార్ హీరో కొనుగోలు చేసాడట.
అందుకే ఈ చిత్రం రిలీజ్ హిందీలో ఆగిపోయినట్టు తెలుస్తుంది. హిందీలో జెనరల్ గా అయితే ఓ సినిమా రీమేక్ హక్కలు కొంటే మరో అదే సినిమా రిలీజ్ అవ్వదు అలాగే ఈ సినిమాకి కూడా జరిగిందని చెప్పాలి.