ఏదో ఒక స్టేజ్ లో మన స్టార్ నటులు తమ ఫిట్నెస్ ని కోల్పోయి ఊహించని రూపాల్లోకి మారిపోతారు. అలానే మళ్ళీ కస్టపడి పాత లుక్ లోకి వచ్చి పాత రోజులు గుర్తు చేస్తారు. మరి ఆ లిస్ట్ లోకే కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అయినటువంటి ఖుష్బూ సుందర్ కూడా చేరుతారు. ఆమె పవన్ “అజ్ఞ్యాతవాసి” తదితర చిత్రాల్లో ఎంత బొద్దుగా లావుగా ఉండేదో చూసాము.
మరి అంత లావు నుంచి ఏకంగా 20 కిలోలు ఆమె తగ్గి స్లిమ్ లుక్ లో కనిపించింది ఇప్పుడు షాక్ చేసింది. మరి ఇలా తగ్గాక ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. తనవి రెండు ఫోటోలు పెట్టి డిఫరెన్స్ చెబుతూ అక్కడి నుంచి ఇక్కడికి. 20 కిలోలు తగ్గానని, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం గుర్తుంచుకోవాలని ఆరోగ్యమే మహా సంపద అంటూ సూచించింది.
నేను అనారోగ్యంతో ఉన్నానా అని అడిగే వారికి, వారి ఆందోళనకు ధన్యవాదాలు. ముందు నేను ఇంతకు ముందు ఎప్పుడూ అంత ఫిట్ గా లేను. నేను మీలో 10 మందిని కూడా బరువు తగ్గడానికి మరియు ఫిట్‌గా ఉండటానికి ప్రేరేపించినట్లయితే, నేను విజయం సాధించానని అనుకుంటున్నాని ఖుష్భు తెలిపారు.