Senior Actress : ఎన్టీఆర్ తో ఛాన్స్ వస్తే ఏ రోల్ అయినా ఓకే అంటున్న సీనియర్ హీరోయిన్.!

Senior Actress :  టాలీవుడ్ మాసెస్ట్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ కి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. లేటెస్ట్ గా వచ్చిన సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో అయితే తనలోని మాస్ ని దర్శకుడు రాజమౌళి వేరే లెవెల్లో ఎలివేట్ చేసాడు. దీనితో ఇండియా మొత్తం ఎన్టీఆర్ పేరు మారు మోగుతుండగా..
లేటెస్ట్ గా ఓ సీనియర్ హీరోయిన్ మరియు ప్రస్తుత నటి రాధికా ఎన్టీఆర్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చెయ్యడం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఎన్టీఆర్ నటన అంటే నాకు చాలా ఇష్టం అని తెలుగులో ఉన్న హీరోస్ తో ఇప్పుడు నటించే అవకాశం వస్తే ఎన్టీఆర్ తో మొదట చేస్తానని..
తనతో ఎలాంటి పాత్రకి అయినా సిద్ధమే అని కానీ ఎన్టీఆర్ నటనతో ఒకసారి ఎలాంటి రోల్ లో అయినా కనిపించాలని ఉందని ఆమె తన చిరకాల కోరిక వెల్లడించారు. దీనితో ఈ వీడియో ఎన్టీఆర్  అవుతుంది.
అయితే గతంలో ఇదే తరహాలో మరో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం మాట్లాడుతూ ఇంతే ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు ఆమెతో పాటు ఈ సీనియర్ హీరోయిన్ గా ఎన్టీఆర్ ఫ్యాన్ లిస్ట్ లో చేరిపోయింది అని చెప్పాలి.
అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్  అయితే తారక్ నెక్స్ట్ సినిమాల్లో ఈమెతో సినిమా చెయ్యాలని ఆశిస్తున్నారు.