మునుపటిలా ఆది పంచ్ లు వేయకపోవడం వెనుక కారణం ఇదే..?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ప్రతినిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ షో నుండి ఎంతోమంది కమెడియన్లు బయటికి వెళ్లిపోయారు. తాజాగా జబర్దస్త్ గ్లామరస్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి దూరం కానుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హైపర్ ఆది సుధీర్ గెటప్ శ్రీను వంటి వారు జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నారు. సుధీర్, శ్రీను ఈటీవి లో ఏ షో లోనూ కనిపించటం లేదు. కానీ ఆది మాత్రం ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో సందడి చేస్తున్నాడు. అయితే జబర్ధస్త్ లో లాగా ఆది కామెడీ పంచ్ లు ఉండటం లేదు.

ఇదిలా ఉండగా జబర్ధస్త్ షో కి ఆదికి అగ్రిమెంట్ పూర్తవటం వల్ల ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. అయితే మల్లెమాల వారితో రెమ్యూనరేషన్ విషయంలో మనస్పర్ధలు రావడం వల్ల ఆది అగ్రిమెంట్ ని రెన్యువల్ చేయటానికి అంగీకరించలేదని సమాచారం. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ షో కి ఇంకా అగ్రిమెంట్ గడువు పూర్తి కాకపోవటం వల్ల ఆ షోస్ లో కనిపిస్తున్నాడు. అయితే ఆది మునుపటిలా ఈ రెండు షోస్ లో కామెడీ చేయటం లేదని టాక్. ఇదివరకు జబర్ధస్త్ లో ఆది వేసే కామెడీ పంచ్ లకి నవ్వి నవ్వి అందరికీ బుగ్గలు నొప్పెట్టేవి. చాలా సందర్భాలలో రోజా కూడా ఈ విషయం చెప్పింది. అయితే ఆది ఇప్పుడు మాత్రం మునుపటి లా ప్రేక్షకులను నవ్వించలేకపోతున్నాడు.

ఆది పంచ్ లు ఇప్పుడు ఇలా పేలవంగా మారాయి ఏంటో అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆది ప్రస్తుతం ఏ టీవీలో నోటిస్ పీరియడ్ లో ఉన్నాడు. అందువల్ల ఆది తన పనిపై ఎక్కువ ఏకాగ్రత చూపడం లేదని టాక్. సాధారణంగా నోటీస్ పీరియడ్ లో ఉన్న ఉద్యోగి ఎక్కువ పని చేయడం కాని.. గతంలో ఉన్నట్లుగా ఉండటం కాని మనం చూడలేం.ఇప్పుడు ఆది కూడా అలాగే చేస్తున్నాడు. గతంలో ప్రేక్షకులను నవ్వించిన ఆది ఇప్పుడు కావాలనే కామెడీ డోస్ తగ్గించాడా.. ? అని అనుమానాలు కలుగుతున్నాయి.