RRR పై సీబీఐ దాడిలో అసలు మతలబు ఇదే.. జగన్ పాత్ర ఎంత..?

raghu rama krishnam raju

 తెలుగు రెండు రాష్ట్రాల్లో నిన్న చిన్న అలజడి సృష్టించిన విషయం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి చెందిన హైదరాబాద్ ఇంటిపై సీబీఐ దాడులు చేయటం. భారీగా అప్పులు ఎగవేశాడనే ఆరోపణలతో సీబీఐ దాడులు చేసినట్లు తెలుస్తుంది. అయితే వీటి వెనుక సీఎం జగన్ హస్తముందని రఘురామ ఆరోపించడం జరిగింది. జగన్ మొన్నటి ఢిల్లీ టూర్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకు చైర్మన్ తో భేటీ జరిగిన తర్వాతి రోజే అదే బ్యాంకు పెట్టిన కేసు విచారణ నిమిత్తం సీబీఐ రఘురామ ఇంట్లో సోదాలు చేయటం తో జగన్ ప్రమేయం ఉందని తెలుస్తుంది.

raghu rama jagna telugu rajyam

 

  అదే సమయంలో రఘురామ రాజు చేసిన ఘనకార్యాలు కూడా తక్కువేమి కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇండ్-భారత్ పేరుతో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు మొదలుపెట్టారు. ఈ కంపెనీ దేశంలో అనేక చోట్ల విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు నెలకొల్పతామని చెపుతూ అనేక బ్యాంకు ల నుండి ఆర్థిక సంస్థల నుండి పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకుంది. భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ , రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ , ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి రూ. వెయ్యి కోట్లు రుణాలు తీసుకున్నారు. కానీ చెప్పిన విధంగా ఎక్కడ కూడా ఒక్క కంపెనీని మొదలుపెట్టలేదు, మొదలుపెట్టిన వాటిల్లో కనీసం 20 శాతం కూడా పూర్తిచేయలేదు . పైగా తీసుకున్న రుణాలను వివిధ రూపాల్లో పక్క దారులకు మళ్లించి బ్యాంకులకు ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు. ఇలా దాదాపు 3 వేలు కోట్లు దాక బకాయిలు వున్నాయి.

  వైఎస్ హయాంలో రఘురామ హవా ఇలా వెలిగిపోవటానికి ప్రధాన కారణం కేవీపీ రామచంద్ర రావు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వైఎస్ ఆత్మ గా చెప్పుకునే ఆయనకు రఘురామ స్వయానా వియ్యంకుడు అవుతాడు. దీనితో అనుకున్న వెంటనే కంపెనీలు పెట్టాను, వేల కోట్లు రుణాలు తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో 2016 లో అవన్నీ మొండి బకాయిలుగా మారిపోయాయి. అప్పటి నుండి రుణాలు ఇచ్చిన సంస్థల అనేక కేసులు పెట్టాయి. ప్రస్తుతం అవన్నీ విచారణ జరుగుతున్నాయి. రఘురామ కంపెనీ ల కేసు “నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్” లో కూడా నడుస్తుంది. ఇలాంటి టైం లో పంజాబ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ దాడులు జరగటం రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటి వెనుక రాజకీయ కోణం లేదని చెప్పలేము కానీ, రఘురామ చేసిన వ్యవహారాలు కూడా తక్కువేమి కాదు..