తెలంగాణ సీఎం కేసీఆర్ బాద్యతల్ని కుమారుడు కేటీఆర్ కి అప్పగించేసి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడానికి సిద్దమవుతున్నట్లు కొన్నాళ్లగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా సమయం ఆసన్నమైందా? సీఎం కుర్చీని వదిలేసి ప్రధాని కుర్చీపై కన్నేసారా? అంటే అవుననే తెలుస్తోంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన వెంటనే…కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు చేసి దేశాన్నే దున్నేయాలని చూసారు. కానీ అది సక్సెస్ అవ్వలేదు. దీంతో కేసీఆర్ తాజాగా రూట్ మార్చారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసి ఢిల్లీ నుంచి చక్రం తిప్పాలని కొత్త ప్రణాళికతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ ఎస్ ఎల్పీలోనూ చర్చ సాగినట్లు సమాచారం.
కాంగ్రెస్ దిగిపోయినా..బిజేపీ అధికారంలోకి ఎక్కినా దేశ ప్రజల తల రాతలు ఎంత మాత్రం మారలేదని విమర్శించారు. తెలంగాణ సాధించిన ఉద్యమ స్ఫూర్తిగా నవ భారత నిర్మాణానికి దిక్సూచి కావాలని అనుకుంటున్నారుట. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని కేసీఆర్ బలంగా నిర్ణయంచికున్నట్లు టీఆర్ ఎస్ వర్గాల్లో జోరుగా చర్చకొస్తుంది. పార్టీ పేరు ఖారైపో యిందని..రిజిస్ర్టేషన్ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు లీకులందుతున్నాయి. రాష్ర్టాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో మంతనాలు కూడా ముగించినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
అటు బీజేపీ జమిలి ఎన్నికల్ని తెరపైకి తీసుకొచ్చి అధ్యక్ష పాలనకు తెరలేపడానికి సన్నధమవుతోంది. అమెరికా తరహాలో అధ్యక్ష పాలను తీసుకురావాలని మోదీ-షాలు నడుం బిగించి పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా రాజ్యంగంలో సంస్కరణలకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశంలో జాతీయ పార్టీలు తప్ప…ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లినట్లే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీని తెరపైకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.