Dil Raju: ఫేక్ కలెక్షన్స్ వేయటం తప్పే…. ప్రెస్ మీట్ లో దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!

Dil Raju: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటి దాడులు జరిగిన సంగతి మనకు తెలిసిందే .ఈయన ఇంటితోపాటు ఆఫీసులో అలాగే తన కుమార్తె బంధువుల ఇలలో కూడా గత నాలుగు రోజులుగా ఐటి అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తూ ప్రతి రూపాయికి లెక్కలు అడుగుతున్నారు. ఇలా నాలుగు రోజుల తర్వాత ఐటి సోదాలు పూర్తి కావడంతో దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ… ఐటి అధికారులు తనపై మాత్రమే దాడి చేయలేదని పలు నిర్మాణ సంస్థలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేదేనని వెల్లడించారు. ఇలా ఐటి అధికారుల దాడి చేయడంతో నా ఇంటిలో భారీగా డబ్బు నకిలీ పత్రాలు దొరికాయి అంటూ తప్పుడు వార్తలను కొన్ని చానల్స్ ప్రచారం చేస్తున్నాయని ఈయన మండిపడ్డారు.

ఐటి అధికారుల సోదాలలో భాగంగా ప్రతి రూపాయికి లెక్క ఉండటం చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారని దిల్ రాజు తెలిపారు. ఐదు సంవత్సరాల నుంచి తాము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదన్నారు. 24 క్రాఫ్ట్స్ లో లావాదేవీల డిటైల్స్ తీసుకున్నారని చెప్పారు. ఇకపోతే ఇటీవల నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ ద్వారా పోస్టర్లు వేయటం గురించి అధికారులు మాట్లాడుతూ నిర్మాతలు అందరితో ఈ విషయం గురించి చర్చించమని తెలిపారు. ఇలా ఫేక్ కలెక్షన్స్ వేయటం చాలా తప్పని ఈ విషయంలో ప్రతి ఒక్కరు మారాల్సిందేనని దిల్ రాజు తెలిపారు.

ఫిబ్రవరి 3వ తేదీ అధికారులు మరోసారి కలవమని చెప్పారు. ఆరోజు ఆడిటర్స్ వెళ్తారని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఐటి సోదాలు జరుగుతున్న నేపథ్యంలో తన తల్లికి అస్వస్థత చేయడంతో చాలామంది ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలోనే తన తల్లి అనారోగ్యానికి గురవడం కూడా ఒక నాటకమే అంటూ కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. నిజానికి తన తల్లిగారు లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ అస్వస్థతకు గురి అయ్యారని ఇలాంటి తప్పుడు వార్తలను దయచేసి ప్రచారం చేయొద్దు అంటూ దిల్ రాజు తెలిపారు.