2024 ఎన్నికల్లో కూడా పవన్ గెలవడం కష్టమేనా.. అదే తప్పు జరుగుతోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాల విషయంలో ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే రాజకీయాల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ సక్సెస్ కావడం తేలిక కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు కేవలం 18 నెలల సమయం మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారో ఇప్పటివరకు క్లారిటీ లేదు. గాజువాక, భీమవరంలలో పవన్ పోటీ చేసినా అనుకూల ఫలితాలు వస్తాయనే గ్యారంటీ లేదు.

సరైన నియోజకవర్గాన్ని ఎంచుకోకపోతే పవన్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండదు. పవన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. పవన్ అమెరికాకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు పవన్ సన్నిహితుల దగ్గర కూడా సరైన సమాధానం లేదు. 2024 ఎన్నికల్లో కూడా పవన్ గెలవడం తేలిక కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్న నేపథ్యంలో పలు నియోజకవర్గాలలో పవన్ తన టీం చేత సర్వేలు చేయించుకున్నారు.

జనసేనకు ఏ నియోజకవర్గాలలో అనుకూల పరిస్థితులు ఉన్నాయో పవన్ కు ఇప్పటికే క్లారిటీ ఉందని తెలుస్తోంది. అయితే పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో 15 నెలల సమయం కేటాయించాల్సి ఉంది. 15 నెలలు సినిమాలకు కేటాయిస్తే కేవలం 3 నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం కేటాయించే ఛాన్స్ అయితే ఉంటుంది. అంత తక్కువ సమయంలో రాజకీయాలపై దృష్టి పెట్టి సక్సెస్ కావడం సాధ్యం కాదు.

పవన్ ఎన్నికల్లో గెలవాలనుకుంటే హరిహర వీరమల్లు, వినోదాయ సిత్తం రీమేక్ లను పూర్తి చేసి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మంచిది. 2024 ఎన్నికల్లో కూడా జనసేనకు ఘోర ఫలితాలు వస్తే మాత్రం ఆ పార్టీ ప్రస్థానం ముగిసినట్లేనని చెప్పవచ్చు. జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యంగా ఉన్నారని అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పవన్ నిర్లక్ష్యమే జనసేనకు శాపమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.