Rajamouli: రాజమౌళి జీవితంలో తీరని కోరిక అదేనా… కోట్లు ఖర్చు చేసిన ఆ కోరిక నెరవేరదా?

Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన మొదట్లో సీరియల్ డైరెక్టర్గా పనిచేసే అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇలా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా లేకుండా అద్భుతమైన విజయాలను అందుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాదు పాన్ వరల్డ్ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు.

ఇక ఇండస్ట్రీలోనే క్రేజీ డైరెక్టర్గా గుర్తింపు పొందిన రాజమౌళి సినిమా అంటే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉంటాయి. ఇలా రాజమౌళి సినిమా కోసం పాన్ వరల్డ్ స్థాయిలో అభిమానులు ఎదురు చూస్తారంటే ఈయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఒక క్రేజీ డైరెక్టర్ ఏదైనా అనుకుంటే ఆ పని క్షణాలలో జరిగిపోతుంది. అలాంటిది ఈయనకు ఒక కోరిక మాత్రం జీవితంలో నెరవేరదని తెలుస్తోది. మరి ఇలాంటి పాపులర్ డైరెక్టర్ నెరవేరని ఆ కోరిక ఏంటి అనే విషయానికి వస్తే…

రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఆయన సినిమాలో చిన్న ఛాన్స్ వచ్చిన చేయడానికి సెలబ్రిటీలు ముందుకు వస్తారు. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసాము అంటే ఆ సెలబ్రిటీల కెరీర్ కు తిరుగు ఉండదు అందుకోసమే ఈయనకి దర్శకత్వంలో సినిమాలు చేయటానికి సెలబ్రిటీలు ఎదురు చూస్తూ ఉంటారు.

ఇలా ఎంతోమంది హీరోలు రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటుండగా రాజమౌళి మాత్రం ఒక హీరోతో సినిమా చేయాలని ఎంతో కోరికగా ఉండేవారట అయితే ఆ కోరిక తీరదని తెలుస్తోంది. మరి రాజమౌళి సినిమా చేయాలనుకుంటున్నా హీరో ఎవరనే విషయాన్నికి వస్తే ఆయన మరెవరో కాదు సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని రాజమౌళికి ఎంతో కోరిక ఉండేదట కానీ రాజమౌళితో సినిమా అంటే రెండు మూడు సంవత్సరాల పాటు ఉండిపోవాలి అంత సమయం పవన్ కళ్యాణ్ కు లేకపోవడంతో ఈయనతో సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిపోయారు. ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న ఈయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికి సమయం పడుతుంది. దీంతో ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఇలా సినిమాలకు దూరమైతే పవన్ తో సినిమా చేయాలనే జక్కన్న కోరిక తీరని కోరికలాగే ఉండిపోతుందని తెలుస్తోంది.