Director Shankar : వైరల్ : ఇది సార్ శంకర్ రేంజు…ఏకంగా “అవేంజర్స్” దర్శకునికే ప్రేరణగా నిలిచాడు.!

Director Shankar : డెఫినెట్ గా చెప్పొచ్చు మన ఇండియా సినిమాని ప్రపంచ స్థాయిలో మొట్ట మొదటి గా తీసుకెళ్లింది శంకర్ అని. భాషలు పక్కన పెడితే భారతీయ సినిమాని వరల్డ్ క్లాస్ లెవెల్లో శంకర్ తన వినూత్న చిత్రాలతో ఎప్పుడు ఆశ్చర్య చకితులను చేస్తూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు శంకర్ కి బ్యాడ్ టైం రావడం ఆ ప్లేస్ లో మన టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఇండియన్ నెంబర్ 1 దర్శకుడు గా కొనసాగడం జరుగుతుంది.

అయితే సినిమా టేకింగ్ పరంగా శంకర్ వేరే లెవెల్లోనే చూపిస్తారు అది అందరికీ తెలిసిందే. కానీ శంకర్ రేంజ్ ఏమిటో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. హాలీవుడ్ లో ఉన్నటువంటి భారీ హిట్ చిత్రాల్లో “అవేంజర్స్” కూడా ఒకటి అయితే ఆ చిత్ర దర్శకులు అయినటువంటి రసో బ్రదర్స్ ని శంకర్ తీసిన భారీ చిత్రం “రోబో” చాలా ప్రేరేపిత చేసిందట. అందులో చూసిన కొన్ని సన్నివేశాలనే చూసి తమ “ఏజ్ ఆఫ్ అల్ట్రాన్” లో కొన్ని సీన్స్ పెట్టామని దానికి శంకర్ సినిమా కారణం అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇది మాత్రమే కాకుండా రీసెంట్ 2.0 లో పక్షి రాజా సీన్స్ కూడా కొన్ని లేటెస్ట్ “బ్లాక్ ఆడమ్” కూడా పెట్టారు అంటూ అభిమానులు ఓ వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనికి మన తెలుగు దర్శకుడు సాయి రాజేష్ కూడా స్పందించి మళ్లీ శంకర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశాడు. సో ఫైనల్ గా ఇది మన ఇండియన్ దర్శకుడు శంకర్ రేంజ్ అంటే.. మరి ప్రస్తుతం అయితే రామ్ చరణ్ భారీ సినిమా పైనే అందరి చూపులు ఉన్నాయి. దీంతో అయినా శంకర్ కం బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.