అంటే సుందరానికి నా కెరీర్ ను తరువాత స్థాయికి తీసుకువెళ్ళే సినిమా.. నటుడు నరేష్ కామెంట్స్!

నాచురల్ స్టార్ నాని ప్రధానపాత్రలో మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికి.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 10వ తేదీ విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సీనియర్ నటుడు నరేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో నరేష్ నాని తండ్రి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే నానీతో పాటు నరేష్ భలే భలే మగాడివోయ్ సినిమాలో నానికి తండ్రిగా నటించగా, దేవదాసు సినిమాలో నానికి బ్రదర్ గా నటించానని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఈ సినిమా తన ఇదివరకు సినిమాల కంటే ఎంతో భిన్నమైనదని తెలిపారు.

తాను ఇది వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నటుడిగా ముఖ్యంగా తండ్రిగా ఎంతో మంచి గుర్తింపు పొందానని అయితే ఈ సినిమా వాటన్నింటికన్నా ఎంతో భిన్నమైనదని తెలిపారు.ఈ సినిమాతో నటుడిగా నేను ఎంతో సంతృప్తి పొందానని ఈ సినిమా తన కెరీర్ ని తర్వాత స్థాయికి తీసుకువెళ్ళే సినిమా అవుతుందని ఈ సందర్భంగా నరేష్ అంటే సుందరానికి సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమా జూన్ 10వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.