ప్రభాస్ తో టచ్ లో ఆ బడా బ్యానర్..బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ కోసమే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఒక బ్రాండ్.. తాను పాన్ ఇండియన్ సినిమాలు చేసే లెవెల్ నుంచి తాను చేసే సినిమా పాన్ ఇండియన్ లెవెల్ కి వెళుతుంది. అందుకే ఇప్పుడు ప్రభాస్ లైనప్ లో డేట్స్ కోసం పలు బడా బ్యానర్ లు క్యూ లో ఉన్నాయి.

అయితే హిందీ మరియు మన టాలీవుడ్ లో పలువురు బడా నిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతూ వీలైనంత త్వరగా ప్రభాస్ తో ఓకే చెప్పించుకుంటున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ ఓ భారీ సినిమాని ప్రభాస్ తో చేయనున్నారని టాక్ రాగా..

ఇప్పుడు మరి బిగ్ బ్యానర్ ప్రభాస్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అదే గీతా ఆర్ట్స్ బ్యానర్. దాదాపు ఈ బ్యానర్ టాలీవుడ్ లో మొదలయ్యి 49 ఏళ్ళు గడిచి మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా మారింది.

మరి ఇప్పుడు వీరి నిర్మాణ సంస్థ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భాన ఓ భారీ సినిమాని ప్రభాస్ తో బెంచ్ మార్క్ సినిమాగా ప్లాన్ చెయ్యాలని అనుకుంటున్నారట. ప్రస్తుతానికి అయితే టాక్ దీనిపై ఉంది. మరి వాస్తవంగా ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది అన్నది టైం డిసైడ్ చెయ్యాలి.