ఇండస్ట్రీ టాక్ : “ఆదిపురుష్” లో ఈ అంశాలు మెరుగ్గా చేస్తున్నారట.!

Adipurush – ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర మంచి డిమాండ్ ఉన్న నటుల్లో హీరో ప్రభాస్ కూడా ఒకడు. మరి ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్”. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు సెట్ చేసుకొని ఉంది.

మరి ఈ చిత్రం టీజర్ తర్వాత సినిమాపై మంచి అంచనాలు స్టార్ట్ అవుతాయి అనుకుంటే అంతా తలకిందులు అయ్యింది. దెబ్బతో ఈ చిత్రం రిలీజ్ మళ్ళీ ఆగిపోయినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం లో ఉన్న దారుణమైన గ్రాఫిక్స్ పై లేటెస్ట్ గా పలు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తల ప్రకారం అయితే ఈ చిత్రంలో కొన్ని అంశాలు చాలా మెరుగ్గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో బాగా డిజప్పాయింట్ చేసిన అంశాలు ఏవి అంటే సైఫ్ అలీ ఖాన్ నటించిన రావణ పాత్రలో కనిపించిన విజువల్ కొంచెం కామెడీగా ఉండగా..

దానిని ఆ లుక్స్ సహా సినిమాలో చూపించిన వానర సైన్యం పై విజువల్స్ ని చాలా సహజంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో ఆదిపురుష్ డెఫినెట్ గా వాయిదా పడింది అని కన్ఫర్మ్ అవుతుంది. అలాగే ఈ గ్రాఫిక్స్ విషయంలో మేకర్స్ అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు.