Crime: ఒకప్పుడు దొంగలు ఇంటిలో ఏదైనా షాపులలో దొంగతనాలు చేసేవారు కానీ ప్రస్తుతం ఆసుపత్రిలో కూడా దొంగతనానికి పాల్పడిన ఘటన తాజాగా హైదరాబాద్లోని పాతబస్తీలో చోటు చేసుకుంది. పాతబస్తీ జాంబాగ్పట్టణ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం ఆసుపత్రిలో దొంగలు పడి ఆసుపత్రిలో ఉన్నటువంటి కొన్ని సామాన్లను దొంగలించారు. ఆస్పత్రిలో ఉన్నటువంటి కంప్యూటర్లు, వ్యాక్సిన్ వయల్స్ కూడా తీసుకెళ్లిన ఘటన పాతబస్తీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
పంజేషాలోని జాంబాగ్‌లో పట్టణ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఎప్పటిలాగే వైద్య సిబ్బంది శనివారం సాయంత్రం వరకు విధులు నిర్వహించి అనంతరం తాళం వేసుకుని వెళ్లారు. సోమవారం తిరిగి సిబ్బంది ఆస్పత్రికి చేరుకోగా ఆసుపత్రి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆస్పత్రిలో ఉన్నటువంటి రెండు కంప్యూటర్లతో సహా మానిటర్, కీబోర్డ్, మౌస్ తో సహా దొంగలించారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ వయల్స్, చిన్న పిల్లలకు వేసే ఇతర వ్యాక్సిన్లను కూడా దొంగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు.అలాగే గోడకు బిగించిన టివిని తీసుకెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అది రాకపోవడంతో టీవీ పగిలిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఇక ఆస్పత్రి తరఫున అన్ని ప్రాంతాలకు వెళ్లే ఆటో జాకీనీ కూడా దొంగలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇలా ఎవరూ ఊహించని విధంగా దొంగలు ఆస్పత్రిలో దొంగతనం చేయడంతో పోలీసులు షాక్ అయిన ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.