మైనర్ బాలికను అపహరించి ఆమెపై హత్యాచారం చేసిన యువకులు!

ఈ రోజులలో ఆడపిల్లగా పుట్టడమే శాపమైంది. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు చిన్నపిల్లలు అన్న కనికరం కూడా లేకుండా మృగాలుగా మారి వారి మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణాలను అడ్డుకోవటానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి వారు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇటువంటి దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం అత్యాచారానికి గురైన బాలిక ఇటీవల తల్లిదండ్రులకు నిజం చెప్పటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…మచిలీపట్నానికి చెందిన 17 ఏళ్ల బాలిక నెల కిందట కిరాణా కొట్టుకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ చిరునామా గురించి ఆమెను ఆరా తీశారు. ఈ క్రమంలో తాము పోలీసులు అంటూ బాలికను నమ్మించి వారితో రావాలని బాలికను బెదిరించారు. ఈ క్రమంలో బాలికను బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని చిలకలపూడి రైల్వే స్టేషన్ వెనుక ఉన్న నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో నిందితులు ఇద్దరు ఆ ఘటన మొత్తాన్ని సెల్ఫోన్లో వీడియో తీసి ఈ విషయం బయటికి చెబితే వీడియో బయట పెడతామని బాలికను బెదిరించారు. అంతేకాకుండా బాలిక వద్ద ఉన్న సెల్ ఫోన్ కూడా లాక్కొని అక్కడి నుండి తప్పించుకున్నారు.

కొంత సమయం తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా దాచి పెట్టింది. ఇటీవల శనివారం సాయంత్రం ఆ యువకులు బాధితురాలు ఇంటి బయట కనిపించారు. దీంతో బాలిక వారిని గుర్తుపట్టి జరిగిన విషయం ఇంట్లో వారికి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద ఉన్న ఫోన్ తో పాటు బాలిక ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.