నేషనల్ హెరాల్డ్ కేసులో ఈరోజు రాహుల్ గాంధీకి ఈడీ అధికారులతో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయం ముందు నిరసనలు కూడా చేపట్టారు. ఇక తాజాగా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఈ విషయం గురించి స్పందిస్తూ విమర్శలు చేశారు.
సోనియా, రాహుల్ గాంధీలను వేదించడానికి ఈడీ కార్యాలయానికి పిలిపించారు అని మండిపడ్డారు. తమ గురించి ఏదైనా సమాచారం కావాలి అంటే వారి లాయర్ల ద్వారా తెలుసు కుంటే సరిపోయేది. అంతేకానీ.. వారిని రాజకీయ అజెండాలో భాగంగా నాలుగు గంటల కార్యాలయంలో కూర్చోబెట్టి వేధించారు అని ఫైర్ అయ్యారు. ఇక ఈ రోజు ఈ విచారణ కు నిరసనగా సత్యాగ్రహం కూడా చేశామని అన్నారు.