వాళ్ళు దూరం అవుతున్నారు జగన్… సి‌ఎం కుర్చీ కే డేంజర్ మరి చూస్కో !

ys jagan to meet amit shah in delhi

 

రాజకీయాల్లో కుల రాజకీయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది.. ఒకరకంగా కుల రాజకీయం చేయని పార్టీ అంటూ లేదు.. వీటిని అడ్డుపెట్టుకునే తెరమీదకు రాని ఎన్నో రాజకీయ కుతంత్రాలు, తెరవెనక నడుస్తాయి.. ఇక ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్ధానాలు చేసిన నాయకులు, అధికారం రాగానే వాటన్నీంటిని అటకెక్కిస్తారు. ముఖ్యంగా ప్రతి పార్టీ నాయకులు కులాల ప్రాతిపాదికన తమ ప్రచారాలు కొనసాగిస్తారు.. ఈ క్రమంలోనే చెప్పుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే.. ఎన్నికల్లో దళిత ఓటు బ్యాంకు అనేది ఎంతో విలువైనది.. కాగా ఈ దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద ఓటు బ్యాంక్ ఉంది..

ఇక ఏపీలో కాంగ్రెస్ ద్వారా ఒక్క కాపులు, కమ్మలు తప్ప అనేక సామాజికవర్గాలు ముఖ్యమంత్రి పదవులు అందుకున్నారు.. అయితే రాజకీయాల పరంగా అగ్ర కులాలుగా ఉన్న బ్రాహ్మణులు. అట్టడుగున ఉన్న దళితులు వెనకబడే ఉన్నారని చెప్పవచ్చూ.. వీరిని ఓటువేసే వరకే ఉపయోగించుకోవడం.. తర్వాత అంతగా పట్టించుకోకపోవడం అందరికి తెలిసిన విషయమే.. ఇదిలా ఉండగా ఏపీలో వైఎస్సార్ తో పాటే దళితులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇపుడు ఆయన కుమారుడు జగన్ వెంట నడుస్తున్నారు. వారికి గట్టి భరోసా ఇచ్చే నేతగా జగన్ ఉండడం వల్లనే వారు అంతా వైసీపీలో కొనాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో దళిత ఓట్లు గనుక రాబట్టుకుంటే జగన్‌ను బాగా దెబ్బతీయవచ్చునని కాంగ్రెస్, టీడీపి భావిస్తున్నారట..

 

ఇక్కడ గమనించ వలసిన విషయం ఏంటంటే.. ఏపీలో వైసీపీకి, బీసీల తర్వాత అత్యధికంగా ఎస్సీ ఓటు బ్యాంకు అండగా ఉంది.. అదీగాక వైఎస్సార్ తమ వాడు అని దళితులు భావిస్తారు. అటువంటి దళిత ఓటు బ్యాంక్ ని వెనక్కు రప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుందట.. ఇదే గాకుండా గతేడాది వైసీపీ హవాతో దారుణ ఓటమి పాలైన టీడీపీ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ సర్కారుపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో దళితుల అంశం కూడా ఒకటి.. ఇక రానున్న ఎన్నికల్లో దళితులు గనుక వైసీపీకి దూరం అయితే జగన్ సీయం కుర్చికే ఎసరు రావచ్చూ.. అందుకే ఈ రాజకీయ ఎత్తుగడలో జగన్ మరింత చురుకుగా వ్యవహరించి తన పార్టీతో పాటుగా, పదవిని కూడా డేంజర్‌లో పడకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైన ఉంది..