ఇదేం చోద్యం.. చిరు సినిమాలకు ఇంత యంగ్ హీరోయిన్లా..?

These Young Beauties Fixed For Megastar Next Films | Telugu Rajyam

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజా మరియు మెహర్ రమేష్ ల కాంబోలో అదిరే సినిమాలు “గాడ్ ఫాదర్” మరియు “భోళా శంకర్” సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అయితే వీటి తర్వాత చిరు చేయబోయే ప్రాజెక్ట్ లకు ఇద్దరు యంగ్ హీరోయిన్ లు ఫిక్స్ అయ్యారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీని ప్రకారం ఆ హీరోయిన్స్ మరెవరో కాదంట ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి మరియు రష్మికా మందన్నాలు అట. రెండు సినిమాలకి ఈ ఇద్దరూ ఫిక్స్ అయ్యారట. అయితే అసలు వారి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది? అసలు ఈ కాంబో అని వింటేనే వింతగా ఉంది. అట్లీస్ట్ చరణ్ తో అయినా అనుకోవచ్చు ఏమో కానీ చిరు తో అంటే ఆలోచించాల్సిందే. ఇక దీనిలో ఎంతవరకు నిజముందో వేచి చూద్దాం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles