మునుపటిలా జబర్ధస్త్ రేటింగ్స్ పెరగాలంటే ఈ రెండు పనులు చేయాల్సిందే…!

బిల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో షోలు ప్రేక్షకులను అలరించడానికి పోటీ పడుతున్నాయి. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ నంబర్ 1 స్థానంలో నిలిచింది. కానీ కొంతకాలం నుండి జబర్దస్త్ రేటింగ్స్ చాలా దారుణంగా పడిపోయాయి. జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ , అదిరే అభి, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి వారు జబర్ధస్త్ నుండి వెళ్ళిపోయారు. వీరు జబర్ధస్త్ ని వీడటంతో జబర్ధస్త్ కల లేకుండా పోయింది. అంతేకాకుండా జబర్ధస్త్ మొదలైనప్పటి నుండి జడ్జిగా కొనసాగుతున్న రోజా కూడా మంత్రి పదవి దక్కడంతో జబర్ధస్త్ కి స్వస్తి చెప్పింది .

జబర్థస్త్ లో ఉన్న ముఖ్యమైన వారు వెళ్లిపోవడంతో జబర్ధస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఈ షో ని ముందుకు తీసుకెళ్లారని జబర్ధస్త్ యాజమాన్యం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. జబర్దస్త్ జడ్జి గా రోజా స్థానంలో ఇంద్రజ వచ్చినా కూడా రోజా లాగా ఆకట్టుకోలేకపాయింది. ఇక జబర్దస్త్‌ లో టీమ్‌ ల విషయంలో కూడా షో నిర్వాహకులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్‌ పరిస్థితి మారాలి అంటే టీమ్‌ లను వెంటనే సర్దుబాటు చేసి మంచి కామెడీ టైమింగ్ ఉన్న వారిని టీమ్ లీడర్లు గా నియమించాలి. అప్పుడు జబర్దస్త్ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం రేటింగ్స్ పడిపోవటంతో జబర్దస్త్ షో టైం కూడా బాగా తగ్గించేశారు. ఇలా షో టైం తగ్గించడం వల్ల జనాలు కూడా ఈ షో చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఇదివరకు ఒక్కో స్కిట్ 10 నుంచి 15 నిమిషాల వరకు ఉండేది కానీ ఇప్పుడు ఏడు నుండి ఎనిమిది నిమిషాలు మాత్రమే ఒక స్కిట్ ఉంటుంది. అందువల్ల టీం లీడర్లు కూడా వారు అనుకున్నది ప్రేక్షకులకి చెప్పలేకపోతున్నారు. అందువల్ల జబర్దస్త్ షో టైమింగ్ మునుపటిలా పెంచాలి. ఇలా చేయడం వల్ల టీమ్ లీడర్స్ వారు అనుకున్న కంటెంట్ ప్రేక్షకులకు చీర వేయగలరు. అందువల్ల ఈ రెండు విషయాలలో జబర్దస్త్ యాజమాన్యం వారు మార్పులు చేసుకుంటే జబర్దస్త్ కి పూర్వవైభవం వస్తుంది అంటూ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.