Hero Suman: నాలుగు పదుల నటజీవితంలో సెన్సేషనల్ స్టార్ సుమన్ తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆయన్ని తెలుగు చిత్రంలో సుమన్‌ని నటించమని మొదటగా అడిగింది ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె. రాఘవ. అయితే అప్పటికే సుమన్ తమిళ చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆ ఆఫర్‌ను సుమన్ తిరస్కరించారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ రావడంతో ఇద్దరు కిలాడీలు సినిమాను అనుకున్నా కొని విబేధాల కారణంగా తరంగిణి సినిమాకు ఓకే చెప్పారు.
ఇకపోతే సుమన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రం ఉగ్రనేత్రుడు. కుష్బు నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమాలో షూటింగ్ జరిగే సమయంలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి సెట్ అంతా కాలిపోయింది. ఆ తర్వాత ట్రెజర్ హంట్ కథాంశంతో రూపొందిన చిత్రం మెరుపు దాడి. తలకోన అడవుల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో నిర్మించారనే ప్రశంసలు తెచ్చుకుంది.
ఇకపోతే నటభూషణ శోభన్ బాబు, సుమన్ కలిసి నటించిన ఏకైక చిత్రం దోషి నిర్దోషి. ఈ సినిమాలో ఫైర్ సీన్ షూట్ చేస్తుండగా సుమన్ జుట్టు, కనుబొమ్మలు కాలాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్టయింది. ఆ తర్వాత పెద్దింటి అల్లుడు, కలెక్టర్ గారి అల్లుడు చిత్రాలు కూడా సుమన్‌కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. రారాజు చిత్రం తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు, సుమన్ కలిసి నటించిన చిత్రం బావ బావమరిది. ఈ సినిమాకు గాను సుమన్‌కు నంది అవార్డు కూడా వచ్చింది. పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు, నేటి భారతం, న్యాయం మీరే చెప్పాలి, కంచు కవచం, పరువు ప్రతిష్ట, ఖైదీ ఇన్స్‌పెక్టర్ కూడా సుమన్‌కు మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. అన్నమయ్య చిత్రంలో ఏడుకొండల పాత్రలో నటించే అవకాశం సుమన్‌కు లభించింది. దొరసాని నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.