హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతినెల ఎంతో పవిత్రమైనది ప్రత్యేకమైన నెలగా భావిస్తారు. ఈ క్రమంలోనే శ్రావణమాసం కూడా ఎంతో పవిత్రమైన ప్రత్యేకమైన మాసం అని చెప్పాలి. శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున మహిళలు పూజలు, నోములు, వ్రతాలు అంటూ భక్తి శ్రద్ధలతో ఈ నెల మొత్తం ఎంతో పవిత్రంగా నిష్టగా భావిస్తూ పూజలు చేస్తుంటారు. శ్రావణమాసం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నెల. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం అమ్మవారికి పూజ చేయడం వల్ల పెద్ద ఎత్తున అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి ఆమె కరుణ కటాక్షాలు మనకు ప్రసాదిస్తుందని చెబుతారు.
ఇలా అమ్మవారికి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మనం పొరపాటున కొన్ని తప్పులు చేయటం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. మరి ఆ తప్పులు ఏంటి అనే విషయానికి వస్తే.. సంధ్యా సమయంలో అమ్మవారు సంచరిస్తూ ఉంటారని చెబుతారు. అందుకే సంధ్యా సమయంలో మనం ఎలాంటి పరిస్థితులలో కూడా తలుపులు మూసి ఉంచకూడదు. ఇలా తలుపులు మూయడం వల్ల అమ్మవారు మన ఇంటికి రారని చెబుతారు.
ఇక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం పొరపాటున కూడా ఇతరులకు డబ్బును కానీ చక్కరైన కానీ దానం చేయకూడదు. వీటిని దానం చేయటం వల్ల మనం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఇతరుల నుంచి అప్పుగా డబ్బును కూడా తీసుకోకూడదు. ఇక చాలామంది మహిళల పట్ల చిన్నచూపు చూస్తూ వారిని నిత్యం దూషిస్తూ ఉంటారు. మహిళలను ఎలాంటి పరిస్థితులలోనూ దూషించకూడదని వారిని గౌరవించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటాయి. కనుక శ్రావణమాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు.