ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ఈ రోజు మొదలైయ్యాయి. బీఏసీ సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
అయితే దీనిపై ప్రతిపక్షము టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కనీసం పదిహేను పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఇక ఈ సమావేశాల్లో 19 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీఏసీ సమావేశంలో 21 ఎజెండా అంశాలను ప్రతిపాదించిన వైఎస్‌ఆర్ సీపీ ప్రతిపాదించింది.
1. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి
2. గత ప్రభుత్వ తప్పిదాలు
3. ఇళ్లపట్టాల పంపిణీ- ప్రతిపక్షాల కుట్ర
4. టిడ్కో గృహాలు-వాస్తవాలు
5. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీ కరణ- ప్రతిపక్షాల కుట్ర
6. వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్పొరేషన్లు ఏర్పాటు,
7. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం
8. కరోనా నియంత్రణ- ప్రభుత్వ చర్యలు
9. వైద్య, ఆరోగ్య రంగం- ఆరోగ్యశ్రీ
10. వ్యవసాయం ఇన్‌పుట్‌సబ్సిడీ, ఆర్‌బీకేలు, సున్నావడ్డీ రుణాలు, మద్దతు ధర, వైఎస్‌ఆర్ జలసిరి
11. గ్రామసచివాలయ, మైరుగైన పనితీరు
12. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ
13. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు
14. మహిళా సాధికారికత, వైఎస్‌ఆర్ చేయూత, ఆసరా, సున్నావడ్డీ
15. మద్యం నియంత్రణ, ప్రభుత్వ సంస్కరణలు
16. సాగునీటి ప్రాజెక్ట్‌లు, రివర్స్ టెండరింగ్
18. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన
19. పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ చర్యలు
20. 9 గంటల ఉచిత విద్యుత్, ప్రభుత్వ సంస్కరణలు
21. నూతన ఇసుక విధానం
మొదటిరోజే పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీనిపై విపక్ష టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లుపై మళ్లీ చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. ఈ బిల్లుపై ఇంతకుముందే అసెంబ్లీ సమగ్ర చర్చ జరిగిందని, ఇక్కడ నుంచి శాసనమండలికి పంపించారని సీఎం తెలిపారు. వినూత్నమైన పద్ధతిలో పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లు తీసుకొచ్చామని వివరించారు. మరికొన్ని బిల్లలపై ప్రతిపక్షాలు సభలో చర్చ జరగాలని పట్టు పట్టి బిల్లులను అడ్డుకోవాలని ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది, అయితే జగన్ సర్కార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును ఇదే సమావేశాలల్లో ఆమోదింప చేసుకోవాలని చూస్తున్నాయి.