Chanakya Niti: తెలుగు ప్రజలకు చాణిక్య గురించి చాణిక్య నీతి శాస్త్రాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విద్యా వాటి విలువలు, గురువు యొక్క గొప్పదనం, వ్యక్తిత్వాలు విలువలు వంటి వాటిని వివరించడలో చాణక్యుడు చాలా ముఖ్యుడు అని చెప్పవచ్చు. ఇక పేదరికం స్థితిలోకి వెళ్లడానికి కొన్ని కారణాలు చాణిక్యుడు వెల్లడించాడు.
అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు మనకు మన మీద జాలితో కొంత సంపదను ఇస్తాడట దాన్ని వృధాగా ఖర్చు చేయవద్దని తెలుపుతున్నాడు. ఇక అవసరానికి మించి ఖర్చు చేయవద్దని ఒకవేళ అలా చేస్తే వాళ్ళు తప్పకుండా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందని చాణిక్యుడు చెబుతున్నాడు.
డబ్బును శుభకార్యాలకు, కొన్ని రకాల సంక్షేమ పథకాలకు మాత్రమే డబ్బులు ఉపయోగించాలి. అంతే తప్ప వేరే అనవసరమైన విషయాలకు డబ్బును ఎక్కువగా ఖర్చు చేయడం అనవసరమని చాణిక్యుడు నీతి శాస్త్రం ద్వారా తెలుస్తోంది. అలాగే పెట్టుబడి విధానం ద్వారా మన సంపదను పెంచుకోవడం మంచిది అని తెలుపుతున్నాడు.
స్వార్థం కోసం అబద్దాలు చెప్పడం…
ఇక అంతే కాకుండా తప్పుదారి పట్టించే వారితో స్నేహం చేయకూడదడని ఆలా చేస్తే మీ డబ్బులు కోల్పోవడంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటారని తెలుస్తుంది. ఇక మోసం చేసి డబ్బు సంపాదించినప్పటికీ అది మీకు ఉపయోగ పడకపోగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. స్వార్థం కోసం కొన్ని అబద్దాలు చెప్పడం కూడా డబ్బులు కోల్పోవడంలో ఒక భాగమని చాణిక్యుడు తెలుపుతున్నాడు.