స్త్రీలలో ఈ మూడు లక్షణాలు మాత్రం అస్సలు ఉండకూడదట.. వాళ్ల జీవితం నరకమంటూ?

chanakya-niti-3-1-3

ఈ మధ్య కాలంలో పెళ్లి తర్వాత వేర్వేరు కారణాల వల్ల విడిపోతున్న జంటల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొంతమంది మగవాళ్లు పెళ్లి తర్వాత ఇతర స్త్రీల వైపు ఎంతగానో ఆకర్షితులు అవుతుండటం గమనార్హం.ఈ విధంగా జరగడం వల్ల కొంతమంది జీవితాలు నాశనం అవుతున్న సందర్భాలు సైతం ఉన్నాయి. చాణక్యుడు చాణక్య నీతిలో భార్యా భర్తల సంబంధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

 

చాణక్యుడు స్త్రీ ద్వారానే సృష్టి స్త్రీ ద్వారానే వినాశనం కలుగుతుందని చెబుతున్నారు. పురుషులు కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీలకు దగ్గరగా ఉండటం మంచిది కాదని చాణక్యుడు వెల్లడించారు. అహంకారం అనేది స్త్రీలకు ఉండే ప్రమాదకరమైన లక్షణం అని చాణక్యుడు వెల్లడించారు. ఏ స్త్రీలో అయితే అహంకారం ఉంటుందో ఆ స్త్రీలో అహం వచ్చిన సమయంలో లక్ష్మీదేవి, సరస్వతీ దేవి దూరం అయ్యే అవకాశం ఉంటుంది.

 

అత్యాశ ఎక్కువగా ఉన్న స్త్రీలు సైతం కుటుంబానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. అత్యాశతో ఉండే స్త్రీల వల్ల కుటుంబంలో ఒత్తిడి, ఇతర సమస్యలు వస్తాయి. స్త్రీ ఇతరులపై ఆధారపడే పరిస్థితిని సైతం ఆమెకు కలిగించకూడదు. ఈ పరిస్థితి ఏర్పడితే స్త్రీ ఆత్మ విశ్వాసం దెబ్బ తినే అవకాశం అయితే ఉంటుంది. మహిళల విషయంలో అతి నమ్మకం పనికిరాదని చాణక్యుడు చెబుతున్నారు.

 

చాణక్య విధానాలను, చాణక్య నీతిని పాటించడం వల్ల ఆనందంగా జీవనం సాగించే అవకాశాలు అయితే ఉంటాయి. ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ద్వారా ఎలా జీవనం సాగించాలో, ఎలాంటి తప్పులు చేయకూడదో వెల్లడించారు. చాణక్యనీతి ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు కెరీర్ పరంగా ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు.