మరొకసారి జత కట్టి ప్రేక్షకులని అలరించనున్న జోడిలు ఇవే..?

సాధారణంగా ఇండస్ట్రీలో కొంతకాలం కొంతమంది హవా మాత్రమే నడుస్తుంది. అది హీరో,హీరోయిన్ల విషయంలో జరుగుతుంది. మునుపటి రోజుల్లో హీరో, హీరోయిన్లు తక్కువగా ఉండేవారు. కానీ ప్రస్తుతం ప్రతీ సంవత్సరం ఎంతోమంది హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అయితే మునుపటి రోజులలో ఒక హీరోతో హీరోయిన్ ఎన్ని సార్లు జత కట్టినా కూడా ప్రేక్షకులు విసుగు లేకుండా సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఒక సినిమాలో కనిపించిన జోడీ మరొక సినిమాలో కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఆ సినిమా చూడటానికి చాలా బోర్ గా ఫీల్ అవుతుంటారు.

ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు ఒకటి కన్నా ఎక్కువ సార్లు కలిసి నటిస్తున్నారు. ఇలా హీరోలతో రెండో సారి కలిసి నటించాలంటే కచ్చితంగా వారు స్టార్ హీరోయిన్లు అయ్యుండాలి. చిన్న చితక హీరోయిన్స్ కి ఒకే హీరోతో రెండో సారి నటించే అవకాశం అస్సలు దొరకదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లు వారు నటించిన హీరోలతో రెండోసారి జత కడుతున్నారు. అలా ఈ మధ్యకాలంలో ఒకసారి నటించిన హీరోలతో మరొకరి నటించే అవకాశం అందుకున్న హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.

అలా రెండోసారి ఒకే హీరోతో నటించే అవకాశం అందుకున్న హీరోయిన్స్ లో కీర్తీ సురేశ్ కూడా ఒకరు. “మిడిల్ క్లాస్ అబ్బాయి” సినిమా లో నాని తో జత కట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం “దసరా” సినిమాలో కూడా నానితో కలిసి నటించనుంది. తర్వాత తమన్నా కూడా మొదట చిరంజీవితో కలిసి “సైరా” సినిమాలో నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇలా ఒకే హీరోతో రెండో సారి నటించే అవకాశం అందుకున్న హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. మొదట మహేష్ బాబుతో కలిసి “మహర్షి” సినిమాలో నటించిన ఈ అమ్మడు మరొకసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తోంది. “వినయ విధేయ రామ”సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటించిన కియారా ఇప్పుడు శంకర్ సినిమా కోసం మళ్లీ చరణ్ తో జత కట్టింది.