Chiranjeevi: చిరంజీవి హిట్లర్ సినిమా కి పెద్ద కుట్ర జరిగింది.. మరుధూరి రాజా షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: తనకు చిరంజీవి హిట్లర్ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఎంతగానో సంతోషించాడని ప్రముఖ దర్శకుడు, రచయిత మరుధూరి రాజా అన్నారు.
ఇక పోతే ఆ సినిమాకు సంబంధించి క్యాసెట్ ని మోహన్ గారు పంపించారని మరుధూరి రాజా తెలిపారు. అన్నం రెడ్డి తాను తన భార్య కలిసి ఆ సినిమాను చూశానని ఆయన చెప్పుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ అయిపోగానే ఆయనకు వెంటనే ఫోన్ చేసి అదిరిపోయింది సర్ ఈ సినిమా పెద్ద సినిమా చేయబోతున్నాం అని ఆయనకు చెప్పినట్టు మరుదూరి రాజా తెలిపారు.

అప్పుడు తన భార్య అక్కడే ఉందని ఏమీ అనలేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత సెకండాఫ్ చూశాక కూడా మళ్లీ ఆయనకు కాల్ చేసి చాలా బాగుందని చెప్పినట్టు రాజా అన్నారు. కాసేపయ్యాక తన భార్యతో కలిసి ఆ సినిమా గురించి డిస్కస్ చేశామని ఆయన అన్నారు చిరంజీవికి నలుగురు చెల్లెలు అంటే ఈ సినిమా ఎవరైనా చూస్తారు అని తన భార్య అడిగినట్టు ఆయన తెలిపారు దానికి తాను ఈ జనరేషన్లో చిరంజీవి గారికి ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుందని ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని ఎంటర్టైన్మెంట్ పరంగానూ విజయం సాధిస్తుందని ఆయన చెప్పినట్టు వివరించారు.

ఆ తర్వాత మూడు రోజులు అయ్యాక ముత్యాల సుబ్బయ్య ఆ సినిమాకు డైరెక్టర్ అని తెలిసింది తాను ముత్యాల సుబ్బయ్య అంటే ఎంత గౌరవించే వాడిని వాడినని, ఆయనతో పని చేసే అవకాశం వచ్చిందని ఏ గొడవ ఉండదని ప్రిపేర్ అయిపోయినట్టు వివరించారు. వారం రోజులయ్యాక చూస్తే రైటర్ పేరు వేరే వచ్చిందని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా సినిమా పోయినందుకు గానీ లేదా హిట్లర్ పోయినందుకు గానీ తాను బాధ పడలేదని.. సుబ్బయ్య గారు వచ్చిన తర్వాత తన పేరు లేదు అంటే తాను ఇంకా ఎవరు గురించి ఆలోచించాలని ఈ హిట్లర్ సినిమా విషయంలో చాలా కుట్ర జరిగిందని ఆ కుట్రలో భాగంగానే ఈ సినిమాకు తాను దూరమయ్యానని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.