బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటీనటులుగా కొనసాగుతున్నటువంటి రణబీర్ కపూర్ అలియా భట్ పెళ్లికి ముందు ఐదు సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్నారు. ఈ విధంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.పెళ్లి తర్వాత ఏ మాత్రం వీరు వారి వ్యక్తిగత జీవితాన్ని గడపకుండా ఎవరి సినిమా పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు.ఈ విధంగా పెళ్లి అయిన మరుక్షణమే రణబీర్ కపూర్ తాను కమిటీ అయినటువంటి యానిమల్ సినిమా షూటింగ్ లో బిజీ కాగా అలియా సైతం హాలీవుడ్ సినిమాతో బిజీగా గడుపుతున్నారు.
తాజాగా నటుడు రణబీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని వారి పెళ్లి బంధం గురించి షాకింగ్ కామెంట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మా జీవితంలో పెద్దగా మార్పులేమీ రాలేదని కొత్తగా ఏమీ లేదని తెలిపారు. పెళ్లయిన తర్వాత హమ్మయ్య పెళ్లయిందనే ఫీలింగ్ తప్ప ఏ విధమైనటువంటి ఫీలింగ్ లేదని తెలిపారు.అయితే మాకు కొన్ని కమిట్మెంట్ ఉండటం వల్ల పెళ్లి అయిన మరుక్షణమే మా ఉద్యోగాలకు వెళ్ళిపోయాము అందుకే మాకు పెళ్లయిందనే విషయాన్ని కూడా గుర్తించలేక పోతున్నామని ఈ సందర్భంగా రణబీర్ వెల్లడించారు.
ఇక పెళ్ళికి ముందు తాము ఐదు సంవత్సరాల పాటు కలిసి ఉండటం వల్ల తమకు పెళ్లి బంధం కొత్తగా అనిపించలేదని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా హాలీవుడ్ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా సమాధానం చెబుతూ ప్రస్తుతానికి హాలీవుడ్ సినిమాల గురించి ఎలాంటి ఆలోచనలు లేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఇకపోతే ఈయన నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం త్వరలోనే విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.