టీడీపీ కంచుకోటలో – ఉప ఎలక్షన్.. ఎమ్మెల్యే రాజీనామా?

విశాఖ: రాజకీయాల్లో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలోకి మారతాడో ఊహించడం చాలా కష్టం. ఇన్ని రోజులు టీడీపీ ఉన్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు . ఆగస్టు 15లోపు వైసీపీ కండువా కప్పుకొనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్తున్న గంటా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలోకి వెళ్లే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని నిర్ణయుచుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

గడిచిన ఎన్నికల్లో విశాఖ నార్త్ జోన్ నుండి పోటీ చేసి కేవలం 1900 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అక్కడ వైసీపీ తరపున కెకె రాజు పోటీ చేసి గంటాకు గట్టి పోటీనిచ్చారు. ఇప్పుడు ఒకవేళ గంటా రాజీనామా చేస్తే ఖచ్చితంగా నార్త్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందే. అయితే ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున మళ్ళీ కె కె రాజును నిలబెట్టడానికి వైసీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడే గంటాకు వైసీపీ నాయకులు ఒక అగ్ని పరీక్ష పెట్టనున్నారని సమాచారం.

ఉప ఎన్నికలు వస్తే రాజును గెలిపించే బాధ్యత గంటాపై పెట్టారు. ఈ పరీక్షకు గంటా కూడా సానుకూలంగా స్పందించారని, అలా గెలిపిస్తే తనకు పార్టీలో మంచి గౌరవం ఉంటుందని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా రాజును గెలిపిస్తే వైసీపీ గంటాకు ఒక నామినేటెడ్ పదవి ఇవ్వడానికి కూడా ఇరువర్గాల మధ్య ఒప్పదం కుదిరిందట. ఒకవేళ గంటా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే టీడీపీ అక్కడ నిలబడగలదా అని రాజకీయ విశ్లేషకులు చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కంచు కోటకు రాజైన గంటా సపోర్ట్ చేసే అభ్యర్థి గెలుస్తాడో లేదా టీడీపీ నాయకుడే గెలుస్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.