Crime: ఈ మధ్యకాలంలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు,అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయే తప్ప తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఆడవారిపై హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఆడవారి కోసం ఎన్నో రకాల చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అయితే ఒక కామాంధుల చేతిలో ఆడవారి బలవుతుంటే మరొక వైపు ఒక యువతీ అత్యాచారం జరిగింది అంటూ పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించింది.
దీంతో పోలీసులు 22 ఏళ్ల యువతిని అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఒక యువతి తనపై 8మంది అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతిచెప్పిన మాటలు నమ్మిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ షాకింగ్ విషయాలు తెలియగానే పోలీసులు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆ యువతి తన తల్లితో గురుగ్రామ్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు హనీ ట్రాప్ పేరుతో మగవారిని వలలో వేసి డబ్బులు గుంజటం అలవాటుగా మారింది.
దీనితో ఆమె వలలో చిక్కనివారి పై నకిలీ అత్యాచారం కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె 8 మందిపై అత్యాచారం చేసినట్టు కేసు పెట్టగా విచారణ జరిపిన పోలీసులు అసలు కూపి లాగారు. ఆమె ఫేక్ అత్యాచారం కేసు పెట్టి పలువురు పురుషుల వద్ద హనీ ట్రాప్ తో డబ్బు లాగుతోందని పోలీసులు బయటపెట్టారు. దీనితో ఈ కేసులో ఆ యువతి తల్లితో పాటు గా నరేందర్ యాదవ్ అనే మరో వ్యక్తి ఫై పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ నరేందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారని ఏసీపీ ప్రీత్ పాల్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు. తాజాగా బుధవారం ఆమెను పోలీసులు కోర్టుకు హాజరపరిచి, అనంతరం జ్యుడీషియల్ కస్టడికి తరలించారని,ఈ కేసును అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.