The Valimai and Now Beast : ఇళయ దళపతి విజయ్ నుంచి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌లో వుండే ఆ హంగామానే వేరు. తెలుగులో కూడా విజయ్‌కి ఓ మోస్తరు మార్కెట్ వుంది. గతంలో ఆయన నటించిన ‘తుపాకి’, ‘మాస్టర్’ తదితర సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
అయితే, లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’ విషయంలో ఎక్కడో తేడా కొట్టింది.
రిలీజ్‌కి ముందున్న క్రేజ్, రిలీజ్ తర్వాత ఫస్ట్ డేకే గల్లంతైపోయింది. విజయ్ చాలా డిజప్పాయింట్ చేశాడంటూ స్వయానా ఆయన ఫ్యాన్సే దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని స్పెషల్‌గా ప్రమోట్ చేశారు ఈ సారి. అందుకు కారణం లేకపోలేదు.
ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్దే నటించడమే.
పూజా హెగ్దేకి తెలుగులో తిరుగు లేదు. ఆమె పట్టిందల్లా బంగారమవుతోంది. ఆ లెక్కల్లో ‘బీస్ట్’ సూపర్ హిట్ అవడం పక్కా అనుకున్నారు. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ‘అరబిక్ కుత్తూ..’ పాట తెలుగులోనూ తెగ పాపులర్ అయిపోయింది.
ప్రోమోలు, పోస్టర్లూ.. ఇలా ప్రీ రిలీజ్ బజ్ ఓ రేంజ్‌లో నడిచింది ‘బీస్ట్’ సినిమాకి.
తీరా సినిమా రిలీజయ్యాకా చప్పబడిపోయిందంతా. అందుకు ముఖ్య కారణం అజిత్ ఫ్యాన్సే అంటూ ఓ వర్గం అభిమానులు సరికొత్త చర్చకు తెర లేపారు. కోలీవుడ్‌లో విజయ్ అభిమానులకీ, అజిత్ అభిమానులకీ మధ్య ఫైట్ సంగతి అందరికీ తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా ఈ హీరోల అభిమానుల మధ్య గట్టి ఫైటే జరుగుతుంటుంది. మొన్న అజిత్ ‘వాలిమై’ టైమ్‌లో విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఇప్పుడు విజయ్ ‘బీస్ట్’ సినిమాకి అజిత్ ఫ్యాన్స్.. ఇలా అనవసరమైన ఫ్యాన్ ఫైట్స్‌తో ఈ ఇద్దరి హీరోలు దారుణంగా నష్టపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే, పరిస్థితి ఇంకెంత దూరం పోతుందో. విజయ్, అజిత్.. జర భద్రం కొడకో.!