ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి సెక్రెటేరియట్, హైకోర్టు వంటివి తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటయ్యాయి. ఇవి నిజానికి శాశ్వత భవనాలే. కానీ, తాత్కాలికం పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ‘దీన్ని సెక్రెటేరియట్ అనగలమా.? దీన్ని హైకోర్టుగా పిలవగలమా.?’ అని జనం ఎక్కడ అనుకుంటారోనన్నది చంద్రబాబు భయం. ప్రపంచ స్థాయి రాజధాని.. అంటూ గ్రాఫిక్స్ బొమ్మలు చూపించి, వాస్తవ రూపంలో ‘తాత్కాలికం’ బోర్డులు పెట్టి కొన్ని నిర్మాణాలు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది.
డిజైన్ల పేరుతో విదేశీ టూర్లతో టైమ్ పాస్ చేసి.. సమయాన్నంతా వృధా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని నిర్మాణం కోసమంటూ హుండీలు వెలిశాయి.. మై బ్రిక్ మై అమరావతి పేరుతో వసూళ్ళకు దిగారు కూడా. అవన్నీ గతం. అసలు ఇప్పుడు అక్కడేమున్నాయి.? అంటే, కొన్ని వున్నాయి. ఇంకొన్ని కొంతమేర నిర్మాలు జరిగి ఆగిపోయాయి. అది వేరే కథ. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి.? ఏడాదికి పైగానే రైతులు ఉద్యమిస్తున్నారు. ఇంకోపక్క అమరావతి భూముల కుంభకోణమంటూ జగన్ సర్కార్, చంద్రబాబుని దోషిగా చూపే ప్రయత్నం చేస్తోంది. ‘తూచ్, అంతా రాజకీయ కక్ష సాధింపే’ అంటున్నారు చంద్రబాబు. తనకు దక్కిన ఐదేళ్ళ సమయంలో చిన్నపాటిదే అయినా రాజధానిని నిర్మించి వుంటే, చంద్రబాబు ఇప్పుడీ విమర్శలు ఎదుర్కొనే అవకాశమే వచ్చి వుండేది కాదు.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అమరావతి పేరుతో పెద్దయెత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నది నిర్వివాదాంశం. తప్పుకి దొరక్కుండా చేశారా.? తప్పు చేసి, తప్పించులేని పరిస్థితి టీడీపీ నేతలకు వస్తుందా.? అన్నది వేరే చర్చ. 10 లక్షల ధర పలికే భూమి 10 కోట్ల విలువకు పెరిగిందంటే, అక్కడ అక్రమాలు లేవని ఎలా అనగలం.? కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? అదే అసలు సమస్య.